One Nation One Election Bill: జేపీసీకి జమిలి బిల్లు.. లోక్ సభలో ఓటింగ్
ABN , Publish Date - Dec 17 , 2024 | 01:51 PM
జమిలి ఎన్నికల సవరణ బిల్లుపై లోక్ సభలో మంగళవారం ఓటింగ్ నిర్వహించారు. ఈ బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు రాగా... వ్యతిరేకంగా 198 ఓట్లు పోలైనాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: జమిలి ఎన్నికల సవరణ బిల్లును లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జు్న్ రామ్ మేఘవాల్ మంగళవారం ప్రవేశపెట్టారు. అనంతరం ఈ సవరణ బిల్లుపై మంత్రి మాట్లాడుతూ.. సమాఖ్య స్పూర్తికి బమిలి బిల్లు విరుద్దం కాదని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదన్నారు. ఈ బిల్లుతో రాష్ట్రాల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదని చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీల కాలపరిమితిపై నిర్ణయం తీసుకొనే అధికారం పార్లమెంట్ కు రాజ్యాంగం కల్పించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Also Read: సభలో ప్రవేశ పెట్టిన జమిలి ఎన్నికల బిల్లు
Also Read: మహిళామణులకు గుడ్ న్యూస్ .. మళ్లీ తగ్గిన పసిడి ధర
ఈ బిల్లును పరిశీలన, చర్చ కోసం ప్రభుత్వం జేపీసీకి పంపడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలతోపాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకే సారి నిర్వహించాలని ప్రతిపాదించే బిల్లును మరింత క్షుణ్ణంగా సమీక్షించాలని పలువురు ఎంపీల సిఫార్స్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆ తర్వాత ఈ బిల్లును జేపీసీకి పంపడానికి కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ ప్రతిపాదించారు. దీనిపై లోక్ సభలో విపక్షాలు డివిజన్ కోరాయి.
Also Read: ఫర్ ది పీపుల్, బై ది పీపుల్‍కు స్వస్తి పలికిన పాలకులు
Also Read: ట్రైయినీ వైద్యురాలి ఘటనలో ఏం జరిగిందో..?
Also Read: బైడెన్ నిర్ణయంపై ట్రంప్ అభ్యంతరం
దీంతో డివిజన్ కు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. అయితే బిల్లును జేపీసీకి పంపినప్పుడు సమగ్ర చర్చ జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అలాగే బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరిగినపుడు కూడా మళ్లీ సమగ్ర చర్చ జరుగుతుందని ఆయన వివరించారు. మరోవైపు పార్లమెంట్ లో ఈ బిల్లుకు అనుకూలంగా 269 మంది సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఈ ఓటింగ్ జరిగింది.
For National News And Telugu News