Share News

Hero Vijay: వివాదాస్పదంగా మారిన విజయ్‌ పార్టీ జెండా..

ABN , Publish Date - Aug 24 , 2024 | 01:08 PM

నటుడు విజయ్‌(Actor Vijay) ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీ కోసం ఆవిష్కరించిన జెండాకు వ్యతిరేకంగా గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో బీఎస్పీ శుక్రవారం ఫిర్యాదు చేసింది. కోలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న హీరో విజయ్‌(Hero Vijay) ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Hero Vijay: వివాదాస్పదంగా మారిన విజయ్‌ పార్టీ జెండా..

- పోలీసులకు బీఎస్పీ ఫిర్యాదు

చెన్నై: నటుడు విజయ్‌(Actor Vijay) ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీ కోసం ఆవిష్కరించిన జెండాకు వ్యతిరేకంగా గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో బీఎస్పీ శుక్రవారం ఫిర్యాదు చేసింది. కోలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న హీరో విజయ్‌(Hero Vijay) ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో ప్రారంభించిన పార్టీ కోసం రూపొందించిన జెండాను ఆయన గురువారం పనయూరులో జరిగిన పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆ జెండా నిండా మెరూన్‌ కలర్‌, పసుపుపచ్చ, పోరాటతత్వానికి చిహ్నంగా రెండు ఏనుగులు, మధ్య వాగై పుష్పం ఉండడం రాజకీయంగా వివాదాస్పదమైంది.

ఇదికూడా చదవండి: Ram Mandir: అయోధ్య రామ మందిరానికి పోస్టులో రూ.2100 కోట్ల చెక్కు.. తర్వాత ఏమైందంటే..


ఈ నేపథ్యంలో, విజయ్‌ పార్టీ జెండాలపై ఏనుగుల బొమ్మలు తొలగించాలంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనందన్‌ డిమాండ్‌ చేశారు. తమ పార్టీ ఎన్నికల గుర్తు అయిన ఏనుగుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ అంగీకారం ఉందని, అందువల్ల ఇతర పార్టీలు తమ ఎన్నికల గుర్తును ఏ రూపంలోనూ వినియోగించుకోరాదని ఆనందన్‌ సోషల్‌ మీడియాలో వీడియో కూడా విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అసోం, సిక్కిం రాష్ట్రాలు మినహా మిగతా ఏ రాష్ట్రాల్లోను తమ పార్టీ చిహ్నం ఏనుగును ఏ జెండాలో వాడకూడదని ఆ వీడియోలో తెలిపారు. అంతేకాకుండా ఆయన విజయ్‌ పార్టీ నిర్వాహకులకు కూడా ఆ వీడియో పంపించారు.


nani1.jpg

ఇదిలా ఉండగా, స్థానిక ఆర్కే నగర్‌ ప్రాంతానికి చెందిన సంఘసేవకుడు ఆర్టీఐ సెల్వం శుక్రవారం వెప్పేరిలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో విజయ్‌ పార్టీ జెండాకు వ్యతిరేకంగా పిటిషన్‌ సమర్పించారు. విజయ్‌ పార్టీ జెండాలో చట్టవిరుద్ధంగా కేరళ రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఏనుగుల గుర్తు ఉందని, వెళ్లాలర్‌ సామాజిక వర్గాలు ఉపయోగించే జెండా రంగులు, స్పెయిన్‌ జాతీయ పతాకంలోని రంగులు, శ్రీలంక తమిళులు గుర్తుగా ఉన్న వాగై పుష్పం అని ఎవరి అనుమతి లేకుండా జెండాలో వాటిని పొందుపరిచారని పేర్కొన్నారు.


కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం 2012వ సంవత్సరం నుంచి ఏ పార్టీ పతాకంలోనూ అడవి జంతువుల ఫొటోలు, పక్షులు వంటి చిహ్నాలను ముద్రించరాదని, అయితే ఈసీ నిబంధనలు కూడా విజయ్‌ పార్టీ ఉల్లంఘించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీ నిబంధనలు అతిక్రమించిన విజయ్‌పై పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలని లేకుంటే హైకోర్టులో కేసు దాఖలు చేస్తానంటూ సెల్వం తన ఫిర్యాదులో తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 24 , 2024 | 01:08 PM