Lok Sabha Polls: శశి థరూర్‌కి పోటీగా కేంద్ర మంత్రి.. దక్షిణాదిపై బీజేపీ అదిరిపోయే స్కెచ్
ABN , Publish Date - Mar 02 , 2024 | 08:38 PM
దక్షిణ భారత్ మినహా అంతటా పట్టు నిలుపుకుంటున్న బీజేపీ ఈ సారి దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన విషయం విదితమే. 195 మంది అభ్యర్థులతో ఈ లిస్టు విడుదలైంది.
ఢిల్లీ: దక్షిణ భారత్ మినహా అంతటా పట్టు నిలుపుకుంటున్న బీజేపీ ఈ సారి దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన విషయం విదితమే. 195 మంది అభ్యర్థులతో ఈ లిస్టు విడుదలైంది. అయితే దక్షిణాదిపై పట్టు పెంచుకునే క్రమంలో బీజేపీ పలు నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులకు ధీటుగా.. కేబినెట్‌లోని కీలక మంత్రులను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ రాజధాని తిరువనంతపురం ఎంపీ శశీ థరూర్‌పై పోటీగా బీజేపీ.. ఓ కేంద్ర మంత్రిని రంగంలోకి దింపింది. ఆయనే ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి, రాజ్యసభ ఎంపీగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్. బలమైన నేతను రంగంలోకి దింపడం ద్వారా ప్రత్యర్థిని ఓడించడం బీజేపీ ప్రణాళికగా తెలుస్తోంది.
ఈ నియోజకవర్గం నుంచి శశి థరూర్ మూడు సార్లు వరుసగా ఎంపీగా ఎన్నికయ్యారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కేరళలో బీజేపీ ఒక్క సీటూ గెలుచుకోలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో 129 స్థానాలకుగానూ 29 చోట్లే బీజేపీ విజయం సాధించింది. ఈ క్రమంలో తిరువనంతపురం స్థానానికి కేంద్ర మంత్రిని పోటీలో దింపడం.. ఆ పార్టీ సుదీర్ఘ లక్ష్యాన్ని తెలియజేస్తోంది.
2019 ఎన్నికల్లో గెలుచుకున్న ఎంపీ సీట్లలో అత్యధికంగా కర్ణాటక, తెలంగాణ నుంచే వచ్చాయి. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. హిందీ హార్ట్ ల్యాండ్ ప్రాంతాల్లో పట్టునిలుపుకుంటున్న బీజేపీకి దక్షిణాదిలో పట్టు సాధించడం అందని ద్రాక్షగానే మారుతోంది. ఈ తరుణంలో ఆ పార్టీ తాజా రాజకీయ ఎత్తుగడ ఫలించి.. గణనీయమైన సీట్లు తెచ్చిపెడతయా అనేదే అతి పెద్ద సవాలని రాజకీయ నిపుణులు అంటున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి