Share News

Indian Railways: దీపావళి పండగ వేళ ఇండియన్ రైల్వేస్ గుడ్‌న్యూస్

ABN , Publish Date - Oct 29 , 2024 | 02:01 PM

పండగ వేళ దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేస్ ఈ కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకులను సురక్షితంగా, సకాలంలో వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ ట్రైన్స్ నడపనున్నట్టు పేర్కొంది

Indian Railways: దీపావళి పండగ వేళ ఇండియన్ రైల్వేస్ గుడ్‌న్యూస్
Train News

దీపావళి పండగకు ముందు రైల్వే ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ గుడ్‌న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో 200 కొత్త రైళ్లను ప్రకటించింది. పండగ వేళ దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేస్ ఈ కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకులను సురక్షితంగా, సకాలంలో వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ ట్రైన్స్ నడపనున్నట్టు పేర్కొంది. న్యూఢిల్లీ, పాట్నా, అహ్మదాబాద్, లక్నో, రోహ్‌తక్, పూణే, ముంబైతో పాటు ఇతర ప్రధాన స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ సర్వీసులను నడపనున్నట్టు పేర్కొంది. ఈ కొత్త రైళ్లకు తోడు పండుగ సీజన్‌లో మరింత మంది ప్రయాణీకుల సౌకర్యార్థం అక్టోబర్ 29, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది. రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించింది.


7000 ప్రత్యేక రైళ్లు

దీపావళి, ఛత్ పూజ సమయంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం 7,000 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రైళ్ల ద్వారా రోజుకు అదనంగా రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.


ప్లాట్‌ఫారమ్ రద్దీ నివారణకు చర్యలు

దీపావళి నేపథ్యంలో స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు గత ఆదివారం ఇండియన్ రైల్వేస్ కీలక ప్రకటన చేసింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, దాదర్, లోకమాన్య తిలక్ టెర్మినస్, థానే, కళ్యాణ్, పూణే, నాగ్‌పూర్‌తో సహా ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల అమ్మకాలపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. దీంతో ప్లాట్‌ఫామ్ టికెట్లను పరిమిత సంఖ్యలోనే విక్రయించనున్నారు. ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట నేపథ్యంలో రైల్వేస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తొక్కిసలాట ఘటనలో పలువురు ప్రయాణీకులు గాయపడ్డారు.


ఇవి కూడా చదవండి

కన్ఫ్యూజ్ అవకండి.. దీపావళి సందర్భంగా బ్యాంక్ హాలిడే ఎప్పుడంటే..

కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు

కేఎల్ రాహుల్‌కు లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని షాక్..

ఉగ్రవాదుల చేతుల్లో ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి.. ఎలా జరిగిందంటే

For more Viral News and Telugu News

Updated Date - Oct 29 , 2024 | 02:03 PM