Share News

Bomb Threat: మోదీని చంపుతామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్

ABN , Publish Date - Dec 07 , 2024 | 05:44 PM

అధికారుల కథనం ప్రకారం, ముంబై ట్రాఫిక్ పోలీసు హెల్ప్‌లైన్‌కు శనివారం ఉదయం వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ప్రధాని మోదీని టార్గెట్‌గా చేసుకుని ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లు బాంబు పేలుడుకు పథకం వేసినట్టు ఆ మెసేజ్‌లో ఉంది.

Bomb Threat: మోదీని చంపుతామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్

ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని చంపుతామంటూ ముంబై పోలీసులకు శనివారంనాడు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు గుర్తించామని, నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాన్ని వెంటనే అక్కడికి పంపామని అధికారులు తెలిపారు.

Bangladesh: Bangladesh: 'ఇస్కాన్' ఆలయానికి నిప్పు.. విగ్రహాలు ఆహుతి


అధికారుల కథనం ప్రకారం, ముంబై ట్రాఫిక్ పోలీసు హెల్ప్‌లైన్‌కు శనివారం ఉదయం వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ప్రధాని మోదీని టార్గెట్‌గా చేసుకుని ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లు బాంబు పేలుడుకు పథకం వేసినట్టు ఆ మెసేజ్‌లో ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని అజ్మీర్‌కు పంపారు. మెసేజ్ పంపిన వ్యక్తి మానసిక స్థిమితం కోల్పోవడం కానీ, మద్యం తాగిన మైకంలో కానీ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. భారతీయ న్యాయసంహితలోని సంబధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ముంబై పోలీస్ హెల్ఫ్‌లైన్‌కు బాంబు బెదిరింపు మెసేజ్‌లు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి బెదిరింపు మెసేజ్‌లు రావడం, అవి ఉత్తవేనని తేలడం జరిగింది.


సల్మాన్‌కు బెదిరింపులు

కాగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ను చంపుపుతామంటూ 10 రోజుల క్రితం ముంబై ట్రాఫిక్ పోలీసులకు రెండు బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. సల్మాన్ బతికుండాలంటే ఆయన రాజస్థాన్‌లోని బిష్ణోయ్ టెంపుల్‌కు వెళ్లి బిష్ణోయ్ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పడం కానీ, రూ.5 కోట్లు చెల్లించడం కానీ చేయాలనే హెచ్చరిక సందేశం అందులో ఉంది. సల్మాన్ ఆ పని చేయకుంటే ఆయనను అంతమొందిస్తామని, బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికీ సజీవంగానే ఉందని కూడా తెలిపింది.


ఇవి కూడా చదవండి...

Shooting: పట్టపగలు దారుణం.. మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యాపారిపై కాల్పులు, హత్య

Minister: మంత్రి కీలక వ్యాఖ్యలు.. అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమే..

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 07 , 2024 | 05:44 PM