Share News

Kerala: రాజకీయ ఉద్రిక్తతల మధ్య బాంబు పేలుడు

ABN , Publish Date - May 13 , 2024 | 06:36 PM

రాజకీయ ఉద్రిక్తతల నడుమ కేరళ లోని కన్నూరు జిల్లాలో సోమవారం ఉదయం బాంబు పేలుడు ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. అయితే, ఈ పేలుడులో ఎవరూ గాయపడకపోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

Kerala: రాజకీయ ఉద్రిక్తతల మధ్య బాంబు పేలుడు

తిరువనంతపురం: రాజకీయ ఉద్రిక్తతల నడుమ కేరళ (Kerala)లోని కన్నూరు (Kannur) జిల్లాలో సోమవారం ఉదయం బాంబు పేలుడు (Bomb blast) ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. అయితే, ఈ పేలుడులో ఎవరూ గాయపడకపోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. చక్కరక్కాల్‌ సమీపంలోని బవొడె ప్రాతంలో ఈ పేలుడు సంభవించిందని, ఆ సమయంలో అక్కడికి సమీపంలోనే పోలీసు సిబ్బంది మోహరించి ఉన్నట్టు అధికారులు తెలిపారు. వెంటనే అక్కడకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ గాలింపు చర్యలు చేపట్టిందని, బాంబు విసిరిందెవరనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు.


కాగా, పేలుడు పదార్ధం ఐస్‌క్రీ బాల్ కంటైనర్ల రూపంలో ఉన్నట్టు పేరు వెల్లడించడానికి నిరాకరించిన పోలీసు అధికారులు తెలిపారు. ఆదివారంనాడు జరిగిన ఒక టెంపుల్ ఫెస్టివిల్‌ సందర్భంగా సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తిందని, ఈ క్రమంలో స్వల్ప తీవ్రతతో సోమవారం ఉదయం జరిగిన బాంబు పేలుడు కలకలం సృష్టించిందని చెబుతున్నారు. తాజా ఘటనపై చక్కరక్కాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2024 | 06:36 PM