Lakshadweep: మోదీ పర్యటన భారీగా పెరిగిన లక్షద్వీప్ క్రేజ్..MakeMyTripలో 3400% సెర్చింగ్
ABN , Publish Date - Jan 08 , 2024 | 05:02 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఇటివల లక్షద్వీప్(Lakshadweep) ప్రాంతాన్ని పర్యటించిన తర్వాత ఆ చోటుకు ప్రస్తుతం ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఏంతలా అంటే లక్షద్వీప్ గురించి ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్‌మైట్రిప్‌లో వెతికే వారి సంఖ్య ఏకంగా 3,400 శాతం పెరిగింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఇటివల లక్షద్వీప్(Lakshadweep) ప్రాంతాన్ని పర్యటించిన తర్వాత ఆ చోటుకు ప్రస్తుతం ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఏంతలా అంటే లక్షద్వీప్ గురించి ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్‌మైట్రిప్‌లో వెతికే వారి సంఖ్య ఏకంగా 3,400 శాతం పెరిగింది. ఈ మేరకు MakeMyTrip సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ Xలో సోమవారం పోస్ట్ చేసి ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ప్రధాని పర్యటన తర్వాత ఈ ద్వీపసమూహం గురించి ఊహించినట్లుగానే భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శోధించినట్లు తెలిపింది.
అంతేకాదు నిన్న లక్షద్వీప్, మోదీ గురించి మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఈ చోటు మరింత హాట్ టాపిక్‌గా మారింది. దీంతో లక్షద్వీప్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో మరింత పెరిగిందని చెప్పవచ్చు. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు ముందు తర్వాత గణాంకాల్లో దాదాపు 3400 శాతం వృద్ధి నమోదైందని MakeMyTrip పేర్కొంది. దీంతో లక్షద్వీప్ ఫేవరెట్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా అవతరించిందని చెప్పవచ్చు. చాలా మంది భారతీయ ద్వీపాన్ని ప్రపంచవ్యాప్తంగా కోరుకునే మాల్దీవులు, సీషెల్స్ వంటి బీచ్ గమ్యస్థానాలతో పోల్చడం ప్రారంభించారు.