Mallikarjun Kharge: నిర్మలా సీతారామన్‍కి ఆ విషయాన్ని గుర్తు చేసిన ఖర్గే
ABN , Publish Date - Dec 16 , 2024 | 02:28 PM
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో పార్లమెంట్‍లో భారత రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో పార్లమెంట్ ఉభయ సభల్లో సోమవారం, మంగళవారాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో ఈ చర్చను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‍యు) నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గుర్తు చేశారు. ఆమె జేఎన్‍యులో చదవు అభ్యసించారన్నారు. తాను మాత్రం మునిసిపాలిటి స్కూల్‍లోనే చదువుకొన్నానని గుర్తు చేశారు. అయితే ఆమె ఇంగ్లీష్.. హిందీలో మాట్లాడే విధానం చాలా బాగుందని ఆయన ప్రశంసించారు. కాని.. ఆమె చర్యలు ఏ మాత్రం బాగోలేదన్నారు. భారత రాజ్యాంగంపై సోమవారం రాజ్యసభలో చర్చను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నెహ్రూ హయాంలో చోటు చేసుకున్న కీలక పరిణామాలను ఈ సందర్భంగా ఆమె సోదాహరణగా వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనదైన శైలిలో ప్రతిస్పందించారు.
Also Read: సోనియా స్పందించ లేదు.. మీరైనా స్పందించండి.. రాహుల్‍కు లేఖ
Also Read: యథావిధిగా కొనసాగనున్న పాపికొండల యాత్ర
Also Read: రాజ్యసభ సభ్యులుగా నేడు ప్రమాణ స్వీకారం
త్రివర్ణ పతాకం, అశోక్ చక్రం, రాజ్యాంగాన్ని ద్వేషించిన వాళ్లు.. నేడు రాజ్యాంగం గురించి పాఠాలు చెబుతున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు.. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో గాంధీ, నెహ్రూ, బీఆర్ అంబేద్కర్ దిష్టి బొమ్మలను ఇదే వ్యక్తులు తలగబెట్టారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగంతోపాటు త్రివర్ణ పతాకాన్ని సైతం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యతిరేకించిందన్నారు. ఎందుకంటే.. మనుస్మృతి ఆధారంగా లేదని వారు ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని వివరించారు. కానీ 2002 జనవరి 26వ తేదీన తొలిసారిగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో బలవంతంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.
Also Read: కాంగ్రెస్ హయాంలో అంతా జైళ్లలోనే..
Also Read: రాజ్యాంగంపై చర్చ ప్రారంభించనున్న మంత్రి నిర్మలా సీతారామన్
Also Read: తుపాన్‍తో చిగురుటాకులా వణుకుతోన్న ‘మయోట్’
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో పార్లమెంట్‍లో భారత రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో పార్లమెంట్ ఉభయ సభల్లో నేడు, రేపు అంటే.. సోమవారం, మంగళవారాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో ఈ చర్చను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయంలో చోటు చేసుకున్న పరిణామాలు.. వాక్ స్వాతంత్రంపై సవరణ చేయడం తదితర అంశాలపై కేంద్ర మంత్రి కాస్తా ఘాటుగా స్పందించారు. దీంతో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తనదైన శైలిలో రాజ్యసభలో కౌంటర్ ఇచ్చారు.
For National News And Telugu News