Share News

Gautam Adani: యూఎస్‌లో కేసులపై క్లారిటీ ఇచ్చిన అదానీ గ్రూప్

ABN , Publish Date - Nov 27 , 2024 | 10:14 AM

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వీనిత్ జైన్‌లపై యూఎస్‌లో లంచం ఆరోపణలపై కేసు నమోదు చేశారనే వార్తల్లో వాస్తవం లేదని గ్రీన్ ఎనర్జీ స్పష్టం చేసింది. వారు సెక్యూరిటీస్‌కు సంబంధించి మోసం కేసులు ఎదుర్కొంటున్నారని వివరించింది.

Gautam Adani: యూఎస్‌లో కేసులపై క్లారిటీ ఇచ్చిన అదానీ గ్రూప్

న్యూఢిల్లీ, నవంబర్ 27: అదానీతోపాటు దాని అనుబంధ సంస్థలు... ఒప్పందాల్లో భాగంగా భారత ప్రభుత్వ అధికారులకు భారీ ఎత్తున లంచాలు ఇవ్వ చూపారనే ఆరోపణలపై ఆమెరికాలో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్‌కు చెందిన గ్రీన్ ఎనర్జీ బుధవారం స్పందించింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వీనిత్ జైన్‌లపై లంచం ఆరోపణలపై కేసు నమోదు చేశారనే వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది.

Also Read: మళ్లీ వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక


ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంచ్ ఫైలింగ్‌లో గ్రీన్ ఎనర్టీ స్పష్టం చేసింది. అయితే వీరిపై ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ (US Foreign Corruption Practices Act) కింద అవినీతి, లంచం తదితర కేసులు నమోదు అయినట్లు వస్తున్న వార్తలు పూర్తి నిరాధారమైనవని పేర్కొంది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వీనిత్ జైన్‌లపై సెక్యూరిటీస్‌కు సంబంధించి మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారే తప్ప.. లంచం, అవినీతి కేసుల్లో కాదని అదానీ గ్రూప్ క్లారిటీ ఇచ్చింది. ఎఫ్‌సీపీఏ చట్టం ఉల్లంఘించారంటూ అమెరికా న్యాయ శాఖ నమోదు చేసిన కేసులో వీరి ప్రస్తావన లేదని అదానీ గ్రూప్ గుర్తు చేసింది.


యూఎస్‌లో గౌతమ్ అదానీపై కేసులు నమోదు అయినట్లు ఆరోపణలు వెల్లవెత్తడంతో.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్‌కు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే తెలంగాణలో ఏర్పాటు కానున్న స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల నిధులను తిరస్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.


అయితే గౌతమ్ అదానీపై ఆరోపణల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... గతంలో గౌతమ్ అదానీకి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న అనుబంధాన్ని ఆయన సోదాహరణగా వివరించిన సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సైతం కూటమి ప్రభుత్వంలోని పలువురు నేతలు.. వైసీపీపై విమర్శలు ఎక్కు పెడుతున్న విషయం విధితమే.

For National News And Telugu News

Updated Date - Nov 27 , 2024 | 10:59 AM