PM Modi: అమిత్ షాతో అజిత్ భేటీ.. కొద్ది గంటలకే.. బీజేపీలో కీలక పరిణామం
ABN , Publish Date - Jul 25 , 2024 | 03:10 PM
మహారాష్ట్ర అంసెబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలల్లో నగారా మోగనుంది. అలాంటి వేళ.. ఆ రాష్ట్రంలోని ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారితో ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్సీపీ (అజిత్) అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బుధవారం న్యూడిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ, జులై 25: మహారాష్ట్ర అంసెబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలల్లో నగారా మోగనుంది. అలాంటి వేళ.. ఆ రాష్ట్రంలోని ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారితో ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్సీపీ (అజిత్) అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బుధవారం న్యూడిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
Also Read: AP Assembly: శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
అమిత్ షాతో అజిత్ భేటీ.. ఆ కొద్ది గంటలకే..
ఆ కొద్ది గంటలకే ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ ఇలా సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 80 నుంచి 90 సీట్లు కేటాయించాలని అమిత్ షాతో భేటీలో డిప్యూటీ సీఎం అజిత్ డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా సీట్ల సర్ధుబాటు విషయంలో ఎన్నికల చివర నిమిషం వరకు కాకుండా.. ముందే ఓ స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు అజిత్ పవార్ విజ్జప్తి చేశారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కూడా ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ చర్చించే అవకాశముందని సమాచారం.
లోక్‌సభ వేళ దెబ్బ పడింది అందుకే..
మరోవైపు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చివర నిమిషంలో అజిత్ పవార్ పార్టీకి ఎంపీ సీట్లు కేటాయించింది. దాంతో సదరు ఎన్నికల్లో ఒకే ఒక్క ఎంపీ స్థానాన్ని అజిత్ పవార్ పార్టీ గెలుచుకుంది. దీంతో సీట్ల పంపకం విషయంలో ముందే స్పష్టత ఉండాలి అమిత్ షాకు ఆయన సూచించినట్లు సమాచారం.
అజిత్ పవార్ పార్టీకి ఒకే ఒక్క స్థానం..
ఇక లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రంలో బీజేపీ కేవలం 9 స్థానాల్లో విజయం సాధించగా.. శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధాని మోదీతో భేటీలో మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రులు నితీన్ గడ్కరీ, పీయూష్ గోయోల్ తదితరులు పాల్గొన్నారు. 288 ఎమ్మెల్యే స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి.
ఓటమి పాలైన అజిత్ పవార్ భార్య..
మరోవైపు ఇవే లోక్ సభ ఎన్నికల్లో బారమతి నుంచి లోక్‌సభ అభ్యర్థిగా శరద్ పవార్ కుమార్తె సుప్రీయా సులే బరిలో దిగగా.. ఆమె ప్రత్యర్థిగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేశారు. అయితే బారమతి ప్రజలు మాత్రం సుప్రియా సులేకు ఓటేశారు. దీంతో సునేత్ర పవార్ ఓటమిపాలయ్యారు.
పెద్దల సభకు సునేత్ర..
ఇంకోవైపు సునేత్రను రాజ్యసభకు పంపేందుకు అజిత్ పవార్ పావులు కదుపుతున్నారు. పెద్దల సభకు పంపడడం ద్వారా.. మోదీ కేబినెట్‌లో తన భార్యకు చోటు కల్పించాలని అజిత్ పవార్ ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. అజిత్ పవార్ వ్యవహారశైలితో పలువురు కీలక నేతలు ఇప్పటికే ఆ పార్టీని విడిన విషయం తెలిసిందే.
Read Latest AP News and Telugu News