Share News

జబల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ‘ఇండిగో’కు బాంబు బెదిరింపు

ABN , Publish Date - Sep 02 , 2024 | 03:51 AM

జబల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన ఇండిగో విమానం నెంబరు 6ఈ 7308కి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది.

జబల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ‘ఇండిగో’కు బాంబు బెదిరింపు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: జబల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన ఇండిగో విమానం నెంబరు 6ఈ 7308కి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో దాన్ని నాగ్‌పూర్‌ మళ్లించి అత్యవసరంగా అక్కడ కిందికి దించివేశారు. క్షుణ్ణంగా తనిఖీలు జరిపిన అనంతరం అది నకిలీ హెచ్చరిక అని తేలింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పింది. మరోవైపు, కోల్‌కతా నుంచి బెంగళూరుకు శుక్రవారం రాత్రి బయలుదేరిన మరో ఇండిగో విమానం ఇంజినులో సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే దాన్ని దింపివేశారు.

Updated Date - Sep 02 , 2024 | 03:52 AM