Share News

Salman Khan case: కాల్పులకు దిగిన అనుమానితులు వీరే.. ఫోటో రిలీజ్ చేసిన ముంబై పోలీసులు

ABN , Publish Date - Apr 14 , 2024 | 09:20 PM

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల ఆదివారం ఉదయం కాల్పులకు దిగిన ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఇద్దరు అనుమానితుల ఫోటోలను విడుదల చేశారు. వీరిద్దరూ బాంద్రా రైల్వే స్టేషన్‌ వైపు వెళ్తున్నట్టు ఈ ఫోటోల్లో ఉంది.

Salman Khan case: కాల్పులకు దిగిన అనుమానితులు వీరే.. ఫోటో రిలీజ్ చేసిన ముంబై పోలీసులు

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) నివాసం వెలుపల ఆదివారం ఉదయం కాల్పులకు దిగిన ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఇద్దరు అనుమానితుల ఫోటోలను విడుదల చేశారు. వీరిద్దరూ బాంద్రా రైల్వే స్టేషన్‌ వైపు వెళ్తున్నట్టు ఈ ఫోటోల్లో ఉంది. బాంద్రా పోలీసులు ఇప్పటికే అగంతకులిద్దరిపై ఐపీసీ సెక్షన్ 307, మారణాయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ భద్రతా గార్డు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

Salman Khan: కాల్పుల కలకలం..సల్మాన్‌ఖాన్‌కు ఫోన్ చేసిన సీఎం


ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో సల్మాన్ ఖాన్ ఉంటున్న గాలక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల మోటారుబైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు కాల్పులు జరిపారు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ నివాసం వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేరుగా సల్మాన్ ఖాన్‌తో ఫోనులో మాట్లాడారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. సల్మాన్ ఖాన్‌కు భద్రత పెంచాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాకరే సైతం సల్మాన్‌ను కలుసుకునేందుకు గాలక్సీ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 14 , 2024 | 09:23 PM