Train: బోగీల నుంచి విడిపోయిన రైలింజన్
ABN , Publish Date - Oct 26 , 2024 | 12:05 PM
వేలూరు జిల్లా కాట్పాడి(Katpadi) సమీపంలో ఎక్స్‌ప్రెస్ రైలింజన్ బోగీల నుంచి విడిపోవడంతో కలకలం రేగింది. అస్సోం రాష్ట్రం డిబ్రూఘర్ నుంచి కన్నియకుమారి(Kanniyakumari) వెళ్లే ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కాట్పాడి సమీపంలో వెళ్తుండగా, ముకుందరాయపురం-తిరువలం మధ్య రైలింజన్ బోగీలను అనుసంధానం చేసే కప్లింగ్ ఊడింది. దీంతో, బోగీలు రైలుపట్టాలపై నిలిచిపోయాయి.
వేలూరు(చెన్నై): వేలూరు జిల్లా కాట్పాడి(Katpadi) సమీపంలో ఎక్స్‌ప్రెస్ రైలింజన్ బోగీల నుంచి విడిపోవడంతో కలకలం రేగింది. అస్సోం రాష్ట్రం డిబ్రూఘర్ నుంచి కన్నియకుమారి(Kanniyakumari) వెళ్లే ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కాట్పాడి సమీపంలో వెళ్తుండగా, ముకుందరాయపురం-తిరువలం మధ్య రైలింజన్ బోగీలను అనుసంధానం చేసే కప్లింగ్ ఊడింది. దీంతో, బోగీలు రైలుపట్టాలపై నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు, ముందు వెళ్లిన రైలింజన్‌ను మళ్లీ వెనుకకు రప్పించి బోగీలను అనుసంధానం చేసి పంపించారు. ఈ ఘటన కారణంగా సుమారు రెండు గంటలు ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
ఈ వార్తను కూడా చదవండి: Delhi: దారుణం.. ఏడు నెలల గర్భవతిని హత్య చేసిన ప్రియుడు.. అసలేం జరిగిందంటే..
..........................................................
ఈ వార్తను కూడా చదవండి:
............................................................
Former CM: నో డౌట్.. 2026లో అధికారం మాదే!
- ఈపీఎస్ ధీమా
చెన్నై: అన్నాడీఎంకేకు రోజురోజుకూ ప్రజాభిమానం పెరుగుతోందని 2026లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) ధీమా వ్యక్తంచేశారు. సేలం జిల్లా ఎడప్పాడిలో శుక్రవారం ఉదయం జరిగిన పార్టీ నిర్వాహకుల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
ఎడప్పాడి నియోజకవర్గం అన్నాడీఎంకేకు ఎల్లప్పుడూ కంచుకోటని, ఈ నియోజకవర్గంలో గెలిచేందుకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకంటే 2024లో జరిగి లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేకి ఒక శాతం ఓట్లు పెరిగాయని, ఈ విషయాన్ని తాను చెబితే ఎడప్పాడి తప్పుడు లెక్కలు చెబుతున్నారని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించటం గర్హనీయమన్నారు.
లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికల వరకూ మౌనం పాటించిన డీఎంకే మిత్రపక్షాలు ప్రస్తుతం తిరుగుబాటు ధోరణిలో వ్యవహరిస్తున్నాయని, అధికారంలో భాగస్వామ్యం కావాలంటూ ఒత్తిడి చేస్తున్నాయని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లోగా కొన్ని మిత్రపక్షాలు ఆ కూటమి నుండి బయటపడే అవకాశం కూడా ఉందని ఈపీఎస్ జోష్యం చెప్పారు.
కూటమికి నాయకత్వం వహిస్తున్న డీఎంకేపై మిత్రపక్షాలు ధ్వజమెత్తుతున్నా, కూటమిలో మనస్పర్థలు లేవని, వివాదాలు మాత్రమేనంటూ స్టాలిన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సుపరిపాలనకు బదులు అవినీతి పాలనను అందించిన డీఎంకేకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కేటీఆర్‌లో వణుకు మొదలైంది: ఆది శ్రీనివాస్
ఈవార్తను కూడా చదవండి: Winter Weather: వణికిస్తున్న చలి పులి..!
ఈవార్తను కూడా చదవండి: jaggareddy: ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి
ఈవార్తను కూడా చదవండి: Kidnap: సంగారెడ్డి ఆస్పత్రిలో కిడ్నాప్.. సంచలనం రేపుతున్న ఘటన..
Read Latest Telangana News and National News