Share News

Train: స్టేషన్‌లో ఆగకుండా వెళ్లిన రైలు... మళ్లీ వెనకొచ్చింది...

ABN , Publish Date - Dec 14 , 2024 | 11:46 AM

రైల్వేస్టేషన్‌(Railway station)లో ఆగకుండా వెళ్లిన రైలు మళ్లీ వెనుక్కి వచ్చిన వ్యవహారంలో లోకోపైలట్‌(Loco pilot)పై సస్పెన్షన్‌ వేటుపడింది. తిరునల్వేలి నుంచి తిరుచెందూర్‌ వెళ్లే రైలు శుక్రవారం ఉదయం 7.50 గంటలకు శ్రీవైకుంఠం సమీపంలోని తాతన్‌కుళం రైల్వేస్టేషన్‌ మీదుగా తిరుచెందూర్‌ వెళుతోంది.

Train: స్టేషన్‌లో ఆగకుండా వెళ్లిన రైలు...  మళ్లీ వెనకొచ్చింది...

- లోకో పైలట్‌ సస్పెన్షన్‌

చెన్నై: రైల్వేస్టేషన్‌(Railway station)లో ఆగకుండా వెళ్లిన రైలు మళ్లీ వెనుక్కి వచ్చిన వ్యవహారంలో లోకోపైలట్‌(Loco pilot)పై సస్పెన్షన్‌ వేటుపడింది. తిరునల్వేలి నుంచి తిరుచెందూర్‌ వెళ్లే రైలు శుక్రవారం ఉదయం 7.50 గంటలకు శ్రీవైకుంఠం సమీపంలోని తాతన్‌కుళం రైల్వేస్టేషన్‌ మీదుగా తిరుచెందూర్‌ వెళుతోంది. ఈ రైలు కోసం తాతన్‌కుళం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులున్నారు. కానీ, రైలు స్టేషన్‌లో ఆగకుండా వెళ్లడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కొద్దిసేపటికి ఈ విషయం గమనించిన లోకోపైలట్‌ రైలును మెల్లగా వెనక్కి తీసుకొచ్చాడు.

ఈ వార్తను కూడా చదవండి: GST: రూ.2.22 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆటోడ్రైవర్‌కు జీఎస్టీ నోటీసు..


nani4.2.jpg

రైలు వెనక్కి వస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఘటన కారణంగా లోకోపైలట్‌ను అధికారులు సస్పెండ్‌(Suspended) చేశారు. కాగా, ఆరు నెలల క్రితం తిరుచెందూర్‌ నుంచి పాలక్కాడుకు వెళ్లే రైలు కచ్చానావిలై రైల్వేస్టేషన్‌లో ఆగకుండా వెళ్లగా, ఈ విషయం గమనించిన డ్రైవర్‌ రైలును వెనుకగా నడిపి మళ్లీ స్టేషన్‌కు తీసుకురావడంతో, ఆ డ్రైవర్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు.


ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు

ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి

ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2024 | 11:49 AM