Union Budget 2024: రికార్డు సృష్టించనున్న నిర్మలమ్మ
ABN , Publish Date - Jul 21 , 2024 | 07:48 PM
వరుసగా ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం ద్వారా నెహ్రు రికార్డును సమం చేశారు. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.
న్యూఢిల్లీ, జులై 21: వరుసగా ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం ద్వారా నెహ్రు రికార్డును సమం చేశారు. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. వరుసగా ఆమె ఏడోసార్లు బడ్జెట్‌ను నేరుగా సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో గతంలో వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలమ్మ అధిగమించబోతున్నారు.
Also Read: Haryana: ఇంటర్‌నేట్ సేవలు కట్..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండో రోజు.. అంటే మంగళవారం జులై 23న లోక్‌సభలో 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. 2019లో ప్రధానిగా నరేంద్ర మోదీ రెండో సారి బాధ్యతలు చేపట్టారు. ఆయన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామాన్ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు వరుసగా ఆమె ఆరు బడ్జెట్‌లను ఆమె ప్రవేశపెట్టారు.
Also Read: Mamata Banerjee: బంగ్లా బాధితులకు ఆశ్రయం.. కీలక ప్రకటన
అయితే ఈ ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల జరిగాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో నిర్మల మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం విధితమే. అయితే 1959 నుంచి 1964 మధ్య మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరు సార్లు కేంద్ర బడ్జెట్‌ను నేరుగా సభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఎన్నికలు జరగడంతో.. మోదీ ప్రభుత్వం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
Also Read: Vizianagaram: శ్రీ విద్యా పీఠంలో గురుపౌర్ణమి వేడుకలు
కానీ సార్వత్రిక ఎన్నికల్లో సైతం మళ్లీ ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. అయితే బీజేపీలోకి పలువురు అగ్రనేతలకు ప్రధాని మోదీ పాత శాఖలనే కేటాయించడం గమనార్హం. దీంతో నిర్మలా సీతారామన్ మళ్లీ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Also Read: Arvind Kejriwal: బీజేపీతోపాటు ఎల్జీపై మళ్లీ మండిపడ్డ ఆప్
ఇక 75 ఏళ్ల భారతావనిలో పలువురు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులుగా వ్యవహరించినా.. నిర్మల, మొరార్జీ దేశాయ్‌లా వారంతా వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టక పోవడం గమనార్హం. దేశస్వాతంత్ర్యానంతరం తొలి బడ్జెట్‌ను ఆర్కే షణ్ముగం చారీ ప్రవేశపెట్టారు. ఇక నెహ్రు, లాల్ బహదూర్ శాస్త్రి కేబినెట్‌లలో ఆర్థిక మంత్రిగా పని చేసిన మొరార్జీ దేశాయ్ మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే పి. చిదంబరం.. మొత్తం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదే విధంగా ప్రణబ్ ముఖర్జీ సైతం 8 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ అయితే 5 సార్లు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Also Read: New Delhi: జగన్ పాలనలో అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News