Share News

AP Elections: టీడీపీ-జనసేన.. బీజేపీ పొత్తుపై కీలక అప్డేట్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్

ABN , Publish Date - Mar 09 , 2024 | 03:56 PM

Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో (AP Politics) కీలక పరిణామమే చోటుచేసుకుంది. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిలో బీజేపీ (BJP) వచ్చి చేరింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మూడ్రోజులుగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి...

AP Elections: టీడీపీ-జనసేన.. బీజేపీ పొత్తుపై కీలక అప్డేట్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో (AP Politics) కీలక పరిణామమే చోటుచేసుకుంది. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిలో బీజేపీ (BJP) వచ్చి చేరింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మూడ్రోజులుగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. టీడీపీ-జనసేన పార్టీలతో పొత్తుకు బీజేపీ అగ్రనాయకత్వం ఓకే చెప్పేసింది. ఇక మిగిలిందల్లా సీట్ల పంపకం మాత్రమేనని టీడీపీ పెద్దలు చెబుతున్నారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఇంకెందుకు ఆలస్యం ఆయన మాటల్లోనే విందాం రండి..

Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!



bjp.jpg

YSRCP: ఒక ఎంపీ.. ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చిన వైఎస్ జగన్.. సడన్‌గా ఇలా జరగడంతో..!?

ఇక అధికార ప్రకటనే..!

బీజేపీతో పొత్తులు కుదిరాయి. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. సీట్ల సర్దుబాటుపై త్వరలో ప్రకటిస్తాం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రాష్ట్ర అభివృద్ధి.. దేశ ప్రయోజనాల కోసమే పొత్తు ఉంటుంది. పొత్తులు అనగానే సీఎం జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైందిఅని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎక్స్‌క్లూజివ్‌గా కనమేడల వివరించారు. అమిత్ షా నివాసంలో సుమారు 50 నిమిషాలకు పైగా జరిగిన కీలక భేటీలో పొత్తు, సీట్ల పంపకాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు టీడీపీ ఎంపీ చెప్పారు. ఈ సమావేశ వివరాలను ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి ఎక్స్‌క్లూజివ్‌గా వివరించారు.

Kanakamedala.jpg

ఇప్పుడిదే చర్చ!!

కాగా.. మూడ్రోజులుగా ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ వరుస భేటీలతో అందరి చూపు ఢిల్లీపైనే పడింది. ఢిల్లీలో ఏం జరుగుతోంది..? బీజేపీతో పొత్తు పొడిచిందా..? లేదా..?.. పొత్తు కుదిరితే ఎన్ని సీట్లు ఇవ్వొచ్చు..? అనేదానిపై గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకూ ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. సీన్ కట్ చేస్తే.. పొత్తు పొడిచింది.. దాదాపు లెక్కలు కూడా తేలిపోయాయి. మరోసారి భేటీతో బీజేపీకి ఇచ్చే సీట్ల పంపకాలపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తమ్మీద పొత్తుపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుందన్న మాట. మరి ప్రకటన ఎప్పుడు వస్తుందో.. ఏయే సీట్లు బీజేపీకి దక్కుతాయో వేచి చూడాల్సిందే.

Pawan-And-Amit-Shah.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Kodali Nani: కొడాలి నాని సంచలన నిర్ణయం.. కంగుతిన్న వైసీపీ!


Updated Date - Mar 09 , 2024 | 04:22 PM