Share News

YS Sharmila : వైఎస్ జగన్‌తో అరగంట భేటీలో ఏం జరిగిందో చెప్పిన షర్మిల..!

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:32 PM

YS Sharmila Mets CM YS Jagan Reddy : ఏపీ సీఎం, సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భేటీ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి వేడుకకు రావాలని జగన్‌కు శుభలేఖ అందజేశారు. కుమారుడు, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన షర్మిల.. అరగంట పాటు భేటీ అయ్యారు. జగన్, వదిన భారతీలకు పెళ్లి కార్డు ఇచ్చిన షర్మిల తప్పకుండా రావాలని ఆహ్వానించారు..

YS Sharmila : వైఎస్ జగన్‌తో అరగంట భేటీలో ఏం జరిగిందో చెప్పిన షర్మిల..!

ఏపీ సీఎం, సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భేటీ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి వేడుకకు రావాలని జగన్‌కు శుభలేఖ అందజేశారు. కుమారుడు, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన షర్మిల.. అరగంట పాటు భేటీ అయ్యారు. జగన్, వదిన భారతీలకు పెళ్లి కార్డు ఇచ్చిన షర్మిల తప్పకుండా రావాలని ఆహ్వానించారు. అరగంటపాటు అన్నా వదినలతో షర్మిల ఏం మాట్లాడారు..? శుభలేఖ ఇవ్వడానికి అరగంట సమయం పట్టిందా..? ఏపీ రాజకీయాల్లోకి షర్మిల అడుగుపెడుతున్నారన్న వార్తల నేపథ్యంలో పాలిటిక్స్ గురించి ఏమైనా మాట్లాడారా..? అనే సందేహాలు అటు వైసీపీ.. ఇటు వైఎస్సార్టీపీ వీరాభిమానుల్లో మెదులుతున్నాయి.


Sharmila-And-Jagan.jpg

ఇదీ జరిగింది..?

సీఎం వైఎస్ జగన్‌తో భేటీ తర్వాత నేరుగా మీడియాతో మాట్లాడుకుండానే తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు షర్మిల కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మీడియాతో మాట్లాడాల్సిందేనని విలేకరులు పట్టుబట్టగా అరగంట భేటీలో ఏం జరిగిందో షర్మిల చెప్పేశారు. సీఎం జగన్ గారిని నా కుమారుడు రాజారెడ్డి పెళ్లికి రమ్మని ఆహ్వానించాను. జగన్ సానుకూలంగా స్పందించారు. పెళ్లనేది చాలా ముఖ్యమైన విషయం. అందరూ నా కుమారుడి పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని మీడియాకు షర్మిల వెల్లడించారు. అంటే.. రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదని షర్మిల తేల్చి చెప్పేశారన్న మాట.


YS-jagan-Sharmila.jpg

ఏం జరుగునో..?

కాగా.. షర్మిల వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని ప్రకటించిన నాటి నుంచి ఏ రేంజ్‌లో వార్తలు పుట్టుకొచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుందనే వార్తలూ వచ్చాయి. అంతేకాదు.. పుట్టింటికి రావొద్దు చెల్లీ అని షర్మిలతో జగన్ రాయబారం నడిపారని కూడా టాక్ రావడం.. ఆ తర్వాత వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి అవన్నీ ఫేక్ అని క్లారిటీ ఇచ్చుకున్నారు. ఇవాళ భేటీ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్‌గానే చర్చ జరుగుతోంది. భేటీ అనంతరం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీకి షర్మిల పయనం అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం నాడు ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Updated Date - Jan 03 , 2024 | 10:37 PM