Share News

Viral Video: వీళ్లకు పెళ్లంటేనే ఇష్టం లేనట్లుంది.. దండలు మార్చుకుంటున్న వధూవరులను చూస్తే..

ABN , Publish Date - May 19 , 2024 | 05:08 PM

పెళ్లిలో అతిథులతో పాటూ వధూవరులు కూడా ఎంతో సంతోషంతో కనిపిస్తుంటారు. కొందరు వధూవరులైతే ఓ అడుగు ముందుకేసి డాన్సులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఊరేగింపు దగ్గర నుంచి వరమాల కార్యక్రమం వరకూ ప్రతి కార్యక్రమంలో...

Viral Video: వీళ్లకు పెళ్లంటేనే ఇష్టం లేనట్లుంది.. దండలు మార్చుకుంటున్న వధూవరులను చూస్తే..

పెళ్లిలో అతిథులతో పాటూ వధూవరులు కూడా ఎంతో సంతోషంతో కనిపిస్తుంటారు. కొందరు వధూవరులైతే ఓ అడుగు ముందుకేసి డాన్సులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఊరేగింపు దగ్గర నుంచి వరమాల కార్యక్రమం వరకూ ప్రతి కార్యక్రమంలో ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా పాల్గొనడం సర్వసాధారణమే. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా తెగ వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా దండలు మార్చుకునే వధూవరుల వీడియోను చూసి అంతా అవాక్కవుతున్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వరమాల (Varamala) కార్యక్రమంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వధూవరులు (bride and groom) దండలు మార్చుకునే సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటుంది. దండలు మార్చుకునే సమయంలో ముందుగా వధువు వంతు వస్తుంది. దండను చేతిలోకి తీసుకున్న వధువు.. పూర్తిగా వరుడి మెడలో వేయకుండా విసిరేస్తుంది.

Viral Video: వామ్మో..! గాడిదలో ఇంత ఆవేశమా.. దాడి చేయాలని చూసిన హైనాను..


వధువు విసిరేయడంతో ఆ దండ కాస్తా.. మెడలో పడకుండా అతడి తలపాగాకు తగులుకుని అలాగే ఉండిపోతుంది. అయినా వరుడు అదేమీ పట్టించుకోకుండా తాను కూడా దండ వేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే తనకూ ఈ కార్యక్రమం ఇష్టం లేనట్లుగా దండను వధువు పైకి విసిరేస్తాడు. దీంతో ఆ దండ వధువు మెడలో కాకుండా జారి పూర్తిగా కిందకు వచ్చేస్తుంది. అక్కడే ఉన్న అతిథులు రంగు రంగు కాగితం టపాసులు పేల్చుతారు.

Viral Video: స్నేహితురాలి పెళ్లిలో యువకుడి నిర్వాకం.. వధువుకు గిఫ్ట్ ఇచ్చినట్లు ఇస్తూనే ..


అయితే వధూవరులు దండలు మార్చుకునే విధానం చూసి వేదిక కింద ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్లకు పెళ్లంటే ఇష్టం లేనట్లుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇద్దరికీ ఇది బలవంతపు పెళ్లేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 85 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైకి వచ్చిన ప్రియురాలు.. చివరికి వరుడు ఎదురుగా ఉండగానే..

Updated Date - May 19 , 2024 | 05:14 PM