Share News

Viral Video: కారులో అద్దం మధ్యలో ఇరుక్కున్న చిన్నారి తల.. పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి.. చివరికి ఏమైందో చూడండి..

ABN , Publish Date - Aug 08 , 2024 | 12:57 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కొడుకును తీసుకుని కారులో వచ్చి ఓ ప్రాంతంలో ఆపుతుంది. ఆమె కారు దిగగానే.. వెనుక కూర్చున్న బాలుడు కారు అద్దం మధ్యలో నుంచి తల బయటికి పెట్టి చూస్తుంటాడు. ఈ క్రమంలో..

Viral Video: కారులో అద్దం మధ్యలో ఇరుక్కున్న చిన్నారి తల.. పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి.. చివరికి ఏమైందో చూడండి..

బస్సు, కారు ప్రయాణ సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కిటికీల్లోంచి చేతులు బయటపెట్టిన సందర్భాల్లో ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఇలాంటి సమయాల్లో కొందరు అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు కూకుండా బయటపడుతుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ చిన్నారి కారు డోరు నుంచి డోరు నుంచి బయటికి చూస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తల అద్దం మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనతో తల్లి భయపడి పరుగెత్తుకుంటూ వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కొడుకును తీసుకుని కారులో వచ్చి సర్వీసింగ్ సెంటర్‌ వద్ద ఆపుతుంది. ఆమె కారు దిగగానే.. వెనుక కూర్చున్న బాలుడు కారు అద్దం మధ్యలో నుంచి తల బయటికి పెట్టి చూస్తుంటాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు (child head stuck in car mirror) అద్దం మధ్యలో తల ఇరుక్కుపోతుంది. ఎంత లాగినా తల బయటికి రాకపోవడంతో చిన్నారి విల్లవిల్లాడిపోతాడు.

Viral Video: మొదటి అంతస్తు నుంచి కుక్క ఫన్నీ గేమ్.. పైకి చూసే పాదచారులపై..


కారు కిందకు దిగిన తల్లి తర్వాత తన కొడుకు పరిస్థితి చూసి కంగారుగా పరుగెత్తుకుంటూ దగ్గరికి వస్తుంది. ఆమె అరుపులతో చుట్టు పక్కల వారు కూడా అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తారు. అంతా కలిసి అద్దాన్ని గట్టిగా పట్టుకుని కిందకు లాగేందుకు ప్రయత్నిస్తారు. అయినా అద్దం కిందకు రాదు. ఇంతలో కొందరు డోరు లాక్ సాయంతో అద్దాన్ని కిందకు దించుతారు. దీంతో బాలుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడతాడు. బాలుడికి ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు.

Viral Video: కారు రూఫ్‌పై షాకింగ్ సీన్.. ప్రేమికుల నిర్వాకం చూసి అవాక్కైన వాహనదారులు..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కారులో చిన్నారును తీసుకెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘అద్దం మధ్యలో ఏదైనా వస్తువు ఉన్నప్పుడు లాక్ కాకుండా ఉంటే బాగుంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంటి పైకప్పు నుంచి ఎప్పుడూ వినని శబ్ధాలు.. పాములేమో అనుకుని పగులగొట్టి చూడగా..

Updated Date - Aug 08 , 2024 | 12:59 PM