Viral Video: వామ్మో..! ఐడియా మామూలుగా లేదుగా.. ఎండ తగలకుండా ఇంటిని ఏసీగా ఎలా మార్చాడో చూస్తే..
ABN , Publish Date - Apr 28 , 2024 | 06:55 PM
ప్రస్తుతం భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. ఎండ వేడి తాళలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లో ఉన్నా కూడా వేడి నుంచి తప్పించుకోలేకున్నారు. దీంతో చాలా మంది ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంత ...
ప్రస్తుతం భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. ఎండ వేడి తాళలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లో ఉన్నా కూడా వేడి నుంచి తప్పించుకోలేకున్నారు. దీంతో చాలా మంది ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంత డబ్బులు వెచ్చించలేని వారు అందుబాటులో ఉన్న వస్తువులతో చల్లగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటుంటారు. అలాగే మరికొందరు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేయడం కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఎండ తగలకుండా ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటినే ఏసీగా మార్చేశాడు. అతడు వాటిని టెక్నిక్ చూసి అంతా అవక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది వివిధ ప్రయత్నాలు చేయడం చూశాం. లారీ నడుపుతూ బకెట్ నీటితో స్నానం చేసిన డ్రైవర్‌ను చూశాం, అలాగే ఇటీవల తన ఆటోపై గోనె సంచులను కట్టి అందరినీ ఆకట్టుకున్న డ్రైవర్‌ను కూడా చూశాం. తాజాగా, ఓ వ్యక్తి తన ఇంట్లో ఎండ వేడి తగలకుండా విచిత్ర టెక్నిక్ వాడాడు. ఇందుకోసం అతను ఏకంగా పొలాల్లో ఏర్పాట చేసే స్ర్పింకర్లను (sprinklers Installation on the house) తీసుకొచ్చి తన పెంకుటింటిపై ఏర్పాటు చేశాడు.
Viral Video: స్నేహితుడిని విడిపించడానికి... ఈ కుక్క చేసిన సాహసం చూస్తే..
ఇంటి పైన వరుసగా స్ప్రింకర్లను ఏర్పాటు చేసి, వాటికి వాటర్ కనెక్షన్ ఇచ్చాడు. ఇంకేముందీ, ఆన్ చేయగానే ఇంటిపైన ఉన్న పెంకులపై నీళ్లు పౌంటెన్ తరహాలో పడుతున్నాయి. ఇలా తన ఇంటిపై ఎండ వేడి పడకుండా సదరు వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వార్నీ.. స్ప్రింకర్లను ఇలాక్కూడా వాడొచ్చా’’.. అంటూ కొందరు, ‘‘ఐడియా అదిరింది బ్రదర్’’.. అంటూ మరికొందరు, ‘‘అనవసరంగా నీటిని వృథా చేస్తు్న్నారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.