Share News

Viral Video: స్నేహితుడిని విడిపించడానికి... ఈ కుక్క చేసిన సాహసం చూస్తే..

ABN , Publish Date - Apr 28 , 2024 | 04:09 PM

సాటి మనిషికి సాయం చేయకపోగా.. కీడు చేసి వేడుక చూసే మనుషులు ఉన్న సమాజం ఇది. ఇలాంటి ప్రస్తుత తరుణంలో మనుషులకంటే జంతువులే నయం అని అనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు నిత్యం ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి...

Viral Video: స్నేహితుడిని విడిపించడానికి... ఈ కుక్క చేసిన సాహసం చూస్తే..

సాటి మనిషికి సాయం చేయకపోగా.. కీడు చేసి వేడుక చూసే మనుషులు ఉన్న సమాజం ఇది. ఇలాంటి ప్రస్తుత తరుణంలో మనుషులకంటే జంతువులే నయం అని అనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు నిత్యం ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కుక్క తన స్నేహితుడిని విడిపించుకునేందుకు చేసిన సాహసం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కుక్కను (dog) ఇంటి బయట కిటికీకి తాడుతో బంధించి ఉంటారు. అక్కడి నుంచి విడిపించుకునేందుకు అది శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ దాని వల్ల సాధ్యం కాదు. కాసేపటి తర్వాత అటుగా వెళ్తున్న ఓ కుక్క గమనిస్తుంది. తన స్నేహితుడిని తాడుతో బంధించి ఉండడం చూసి పరుగుపరుగున దగ్గరికి వెళ్తుంది. ఎలాగైనా తన స్నేహితుడిని విడిపించాలని ప్రయత్నం చేస్తుంది. తాడును కొరికేయాలని చూస్తుంది.

Viral Video: రాత్రి వేళ ఇలాంటి డ్రస్సులు వేసుకుని రోడ్డుపైకి వెళ్తున్నారా.. అయితే ఈ వీడియో చూడండి..


మొదటి ప్రయత్నంలో అది సాధ్యం కాకపోవడంతో మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. కిటికీ పైకి ఎగబాకి మరీ తాడును కొరికే ప్రయత్నం చేస్తుంది. ఈ వీడియో అంతటితో ముగుస్తుంది. స్నేహితుడిని కాపాడేందుకు ఈ కుక్క చూపిన చొరవ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన వారంతా కుక్కను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అందుకే కుక్కలు విశ్వాసానానికి మారుపేరుగా నిలిచాయి’’.. అంటూ కొందరు, ‘‘ఈ కుక్కను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.47లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వావ్..! ఏం ఐడియా బ్రదర్.. వేసవిలో వద్దన్నా కూడా అంతా ఈ ఆటోనే ఎక్కేస్తారు.. ఎందుకంటే..

Updated Date - Apr 28 , 2024 | 04:09 PM