Share News

Wedding viral video: దండలు మార్చుకుంటుండగా.. వరుడిని అనవసరంగా రెచ్చగొట్టారే.. చివరకు వధువు పరిస్థితి..

ABN , Publish Date - Apr 28 , 2024 | 04:52 PM

వివాహ కార్యక్రమాల్లో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్‌ల కోసం కొందరు ఏవేవో ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం. మరికొన్నిసార్లు వధూవరులను ఆట పట్టించే క్రమంలో చోటు చేసుకునే ఘటనలు అందరినీ తెగ నవ్విస్తుంటాయి. ఇలాంటి..

Wedding viral video: దండలు మార్చుకుంటుండగా.. వరుడిని అనవసరంగా రెచ్చగొట్టారే.. చివరకు వధువు పరిస్థితి..
ప్రతీకాత్మక చిత్రం

వివాహ కార్యక్రమాల్లో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్‌ల కోసం కొందరు ఏవేవో ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం. మరికొన్నిసార్లు వధూవరులను ఆట పట్టించే క్రమంలో చోటు చేసుకునే ఘటనలు అందరినీ తెగ నవ్విస్తుంటాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వధూవరులు దండలు మార్చుకుంటుండగా.. పక్కన ఉన్న వారు చేసిన నిర్వాకానానికి చివరు వధువు పరిస్థితి ఏమైందో చూడండి.


సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వేదికపై వధూవరులు (bride and groom) దండలు మార్చుకుంటుంటారు. వధువు దండ వేయగానే.. వరుడి వంతు వస్తుంది. వరుడు దండ తీసుకుని వధువు మెడలో వేస్తుండగా పక్కన ఉన్న బంధువులు.. వధువును పైకి ఎత్తుకుంటారు. దీంతో దండ వేయడం వరుడికి కష్టమైపోతుంది. అయినా ఎలాగోలా దండ వేయాలని ప్రయత్నిస్తాడు. దీంతో వధువును వారు వరుడికి అందనంత ఎత్తులో ఉంచుతారు.

Viral Video: స్నేహితుడిని విడిపించడానికి... ఈ కుక్క చేసిన సాహసం చూస్తే..


వారు చేసిన నిర్వాకంతో వరుడికి చిర్రెత్తుకొచ్చి.. పక్కన ఉన్న సోఫా పైకి ఎక్కి, అక్కడి నుంచి పైకి ఎగిరి వధువు మెడలో దండ వేసేస్తాడు. దీంతో వధువును ఎత్తుకున్న వారు అదుపు తప్పి కిందపడిపోతారు. వారితో పాటూ వధువు కూడా ధబేల్‌మని కింద పడుతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కామెడీ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు కొన్నిసార్లు ప్రమాదానికి దారి తీయొచ్చు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వావ్..! ఏం ఐడియా బ్రదర్.. వేసవిలో వద్దన్నా కూడా అంతా ఈ ఆటోనే ఎక్కేస్తారు.. ఎందుకంటే..

Updated Date - Apr 28 , 2024 | 04:52 PM