Modified Toycar: వీడెవడండీ బాబూ! ఇంజినీరింగ్ చదువును తెలివిగా వాడి.. బొమ్మ కారుతో గిన్నిస్ రికార్డు!
ABN , Publish Date - Feb 20 , 2024 | 05:49 PM
ఇంజినీరింగ్ చదువు ఇచ్చిన నైపుణ్యాలను కొత్తగా వాడుకున్న ఓ జర్మన్ విద్యార్థి ఏకంగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంజినీరింగ్ చదువు ఇచ్చిన నైపుణ్యాలను కొత్తగా వాడుకున్న ఓ జర్మన్ విద్యార్థి ఏకంగా గిన్నిస్ రికార్డు (Guiness Records) సొంతం చేసుకున్నాడు. బొమ్మ కారుతో (Modified Toy car) ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంజినీరింగ్ నైపుణ్యాలున్న (Engineering Skills) వారు ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు, కొత్త సంస్థలు నెలకొల్పుతుంటే ఈ విద్యార్థి మాత్రం సపరేటుగా రూట్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మార్సల్ పాల్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బొమ్మకారును సృష్టించిన పాల్ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. అతడి బొమ్మ కారు గరిష్ఠ వేగం సుమారు 148 కిలోమీటర్లు. తనకున్న ఇంజినీరింగ్ నైపుణ్యాలతో అతడు విద్యుత్‌తో నడిచే బొమ్మకారుకు మార్పులు చేశాడు. ఆ తరువాత కారుపై కూర్చుని మునుపెన్నడూ చూడని వేగంతో దూసుకుపోయి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బొమ్మ కారుపై ఏటవాలుగా కూర్చుని అతడు నడుపుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోకు ఇప్పటివరకూ 6.5 లక్షల వ్యూస్ వచ్చాయి.
అతడి వెరైటీ ప్రయత్నాన్ని చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. రికార్డు అంటే ఇదికదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫెర్రారీ లాంటి రేసింగ్ వాహనం సైకిల్ ధరకు అందుబాటులోకి రావడమంటే ఇదే అని అన్నారు. చూడటానికి ఇది ప్రమాదకరమైన సాహసంగా కనిపిస్తోంది కానీ ఇతడిని మెచ్చుకోవాల్సిందే అని కొందరు అభిప్రాయడ్డారు. ఈ కారును సిద్ధం చేసేందుకు పాల్ దాదాపు 10 నెలలు కష్టపడ్డాడని గిన్నిస్ రికార్డు వారు తెలిపారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి