Viral: దేవాలయం హుండీలో రూ.1.25 లక్షలు, ఓ ఉత్తరం! అందులో రాసున్నది చదివితే..
ABN , Publish Date - Sep 24 , 2024 | 03:53 PM
చిన్నతనంలో గుడిలో చోరీ చేసిన ఓ వ్యక్తి పెద్దయ్యాక ఆ సొమ్ము తిరిగిచ్చేశాడు. అంతేకాకుండా, క్షమాపణ చెబుతూ ఓ లేఖ కూడా రాశాడు. దక్షిణకొరియాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణకొరియాలో తాజాగా ఓ స్ఫూర్తిదాయక ఉదంతం వెలుగులోకి వచ్చింది. చిన్నతనంలో గుడి హుండీలో డబ్బు దొంగిలించిన ఓ బాలుడు ఇటీవలే దాన్ని తిరిగిచ్చేశాడు. హుండీలో డబ్బుతో పాటు ఓ ఉత్తరం కూడా వదిలివెళ్లాడు. ఉత్తరంలోని అంశాలు ప్రస్తుతం స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నాయి. దీంతో, ఈ అంశం అక్కడ చర్చనీయాంశంగా మారింది (Viral).
1997లో ఆ దేవాలయంలో తాను దొంగతనం చేశానని అజ్ఞాత వ్యక్తి ఉత్తరంలో రాశాడు. దేవాలయం సిబ్బందికి హుండీలో అతడి ఉత్తరంతో పాటు రూ.1.25 లక్షలు (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) ఉన్న ఎన్వలప్ కూడా లభించింది. లేఖలోని వివరాలు అనేక మందిని కదిలించాయి (Viral).
Viral: చిరుతకు చుక్కలు చూపించిన ఉడత! దీని స్కెచ్ మామూలుగా లేదుగా!
‘‘అప్పట్లో నాకు మంచీ చెడుల విచక్షణ లేదు. సుమారు 27 ఏళ్ల క్రితం నేను హుండీలోంచి డబ్బు దొంగిలించా. ఆ తరువాత కొద్ది రోజులకు మళ్లీ డబ్బులు దొంగిలించేందుకు వెళ్లగా ఓ సాధువుకు దొరికిపోయాను. కానీ ఆయన నన్ను ఏమీ అనలేదు. నా భుజంపై చేయ్యి వేసి కళ్లల్లోకి సూటిగా చూశారు. ఆ తరువాత నన్ను వదిలిపెట్టారు. ఆ తరువాత నేను యథాప్రకారం ఇంటికి వెళ్లిపోయా. కానీ నాటి నుంచి నా జీవితం మొత్తం మారిపోయింది. నాది కానిది ఏదీ నేను ఆశించలేదు’’
Viral: దంపతుల ఏళ్ల నాటి కల.. 17 కోట్లు పెట్టి భారీ ఎస్టేట్ కొంటే..
‘‘జీవితంలో కష్టపడి పని చేసి మంచి స్థితికి చేరుకున్నా. ప్రస్తుతం నేను తండ్రి కాబోతున్నాను. ఒకప్పటి నా జీవితం గురించి తరచి చూసుకుంటే ఆ సాధువు చూపు ఓ మంత్రంలా నన్ను మార్చేసిందనిపిస్తోంది. గతంలోనే ఈ డబ్బు తిరిగి ఇవ్వలేకపోయినందుకు చింతిస్తున్నాను. నేను రుణం తీసుకుని తిరిగిస్తున్నట్టు భావిస్తారని ఆశిస్తున్నా. నా బిడ్డ గర్వించే తండ్రిలా ఆదర్శప్రాయంగా ఉండాలనుకుంటున్నా’’ అని రాసుకొచ్చాడు. ఆ సాధువుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నట్టు పేర్కొన్నాడు.
Viral: 18 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు తెలిసి షాక్!
నాటి సాధువు ఇప్పటికీ అదే దేవాలయంలో నివసిస్తున్నారు. కానీ తనకు ఆ బాలుడి ముఖం గుర్తులేదని చెప్పారు. అప్పట్లో దేశం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకునేందుకు తాను హుండీలో డబ్బులు ఉంచి తాళం వేయకుండా వెళ్లేవాణ్ణని ఆయన చెప్పుకొచ్చారు. తాళాలు పగలగొట్టాల్సిన అవసరం లేకుండా అలా చేశానని వివరించారు. ఉత్తరం రాసిన అజ్ఞాతవ్యక్తిలో వచ్చిన మార్పునకు సంతోషం వ్యక్తం చేశారు. అతడు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. దక్షిణకొరియాలోని గియోన్సాంగ్ ప్రావిన్స్‌లోగల టాంగ్డో దేవాలయంలో ఈ ఘటన జరిగింది.
Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?
Legal Awareness: భారతీయ మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన టాప్ 5 చట్టాలు!
Viral: ఢిల్లీలో పర్యటిస్తూ భారత్‌పై బ్రిటీషర్ అవాకులు చవాకులు! వీడియో వైరల్