Share News

Tasty Food: మరుసటి రోజు తింటే.. అదిరిపోయే రుచిని అందించే.. ఆ 5 వంటకాలు ఏంటంటే..

ABN , Publish Date - Jan 23 , 2024 | 08:18 PM

వేడి వేడి ఆహారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తికాదు. చల్లారిన ఆహారం తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే అన్ని ఆహార పదార్థాలను అలాగే తినేస్తామంటే.. మీరు మంచి రుచిని మిస్ అయినట్లే. ఎందుకంటే...

Tasty Food: మరుసటి రోజు తింటే.. అదిరిపోయే రుచిని అందించే.. ఆ 5 వంటకాలు ఏంటంటే..

వేడి వేడి ఆహారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తికాదు. చల్లారిన ఆహారం తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే అన్ని ఆహార పదార్థాలను అలాగే తినేస్తామంటే.. మీరు మంచి రుచిని మిస్ అయినట్లే. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలను వేడి వేడిగా కాకుండా మరుసటి రోజు తింటే అసలైన రుచి ఏంటో తెలుస్తుంది. మరుసటి రోజు తింటే మజా అనిపించే ఆ 5 వంటకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ కాలంలో అయినా ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ కొన్ని వంటకాలను మాత్రం వండినప్పుడు కాకుండా మరుసటి రోజు తింటే ఎంతో రుచిగా ఉంటాయి. వండిన తర్వాత గ్యాప్ ఇవ్వడం వల్ల అందులోని అసలు రుచి బయటకు వస్తుందన్నామాట. ఆ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాజ్మా

Rajma-curry.jpg

ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తినే రాజ్మా అనే వంటకం వేడిగా తినేకంటే మరుసటి రోజు తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఎర్రటి కిడ్నీ బీన్స్‌తో చేసే ఈ వంటకాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. కిడ్నీ బీన్స్‌ను నానబెట్టి, ఉల్లిపాయలు, టొమాటోలు, మసాలా దినుసులతో ఉడకబెట్టి రాజ్మా మసాలాను తయారు చేస్తారు. దీనిని రాజ్మా లేదా లాల్ లోబియా అని కూడా పిలుస్తుంటారు.


మాంసాహార కూరలు

Chicken-curry.jpg

మాంసాహార వంటకాలైన బటర్ చికెన్, చికెన్ కర్రీ, దాల్ మఖానా తదితర కూరలు కూడా వండినప్పటి కంటే మరుసటి రోజు తింటే అసలు రుచి తెలుస్తుంది. ఈ కూరల్లో చాలా వరకు టమాటా, ఆనియన్ గ్రేవీ, కొన్ని మసాలాలను కలుపుతారు. ఇవన్నీ కలవడం వల్ల మరుసటి రోజు తింటే ఎంతో రుచిగా మారతాయి.

చోలే మసాలా

Chole-Masala.jpg

చోలే మసాలా కూర కూడా మరుసటి రోజు తినడానికి ఎంతో బాగుంటుంది. సాధారణంగా శనగలు వేడి చేసినప్పటి కంటే మరుసటి రోజు రుచిగా ఉంటాయి. రాత్రంతా అలాగే ఉంచడం వల్ల మసాలాలోని శనగలు మృదువుగా మారతాయి. దీంతో తర్వాతి రోజు తినడం వల్ల అందులోని అసలు రుచి తెలుస్తుంది.

క్యారెట్ హల్వా

Carrot-Halwa.jpg

క్యారెట్ హల్వా అప్పటికప్పుడే తినడం కంటే మరుసటి రోజు తింటేనే బాగుంటుంది. డ్రైఫ్రూట్స్‌తో కలిపి దీన్ని తయారు చేయడం వల్ల మరుసటి రోజుకు రుచి మరింత పెరుగుతుంది.

బిర్యానీ

biryani.jpg

చాలా మందిని బిర్యానీని కూడా రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు తింటుంటారు. బాస్మతి బియ్యం, మాంసం, మసాలాలు కలిపి తయారు చేయడం వల్ల వేడిగా ఉన్నప్పటి కంటే.. మరుసటి రోజు తినడం వల్ల దాని రచి మరింత పెరుగుతుంది.

మానవాతీత శక్తులు ఉన్న.. ఈ ఏడుగురి గురించి తెలుసా..

Updated Date - Jan 23 , 2024 | 08:21 PM