Share News

Viral Video: ఇందేందయా ఇదీ.. పావురం ఇంత పని చేసిందేంటి..!

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:40 PM

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) ముంగేలి జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పావురాలను(Pigeons) సభా వేదికపై ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎగురవేశారు. ఆ క్రమంలోనే ఓ పోలీస్ అధికారి పావురాన్ని ఎగురవేయగా అది పైకి వెళ్లడానికి బదులుగా కిందపడింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Viral Video: ఇందేందయా ఇదీ.. పావురం ఇంత పని చేసిందేంటి..!
Pigeon flying tragedy during Independence Day

ఇటివల స్వాతంత్ర దినోత్సవం(Independence Day celebrations) సందర్భంగా ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. దీనిపై అధికారులు సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలేం జరిగిందంటే ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) ముంగేలి జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పావురాలను(Pigeons) సభా వేదికపై ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎగురవేశారు. ఆ క్రమంలోనే ఓ పోలీస్ అధికారి పావురాన్ని ఎగురవేయగా అది పైకి వెళ్లడానికి బదులుగా కిందపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. మంగళవారం ఈ సమాచారం అందజేసి ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు.


కార్యక్రమంలో

ముంగేలి జిల్లా(Mungeli district) కేంద్రంలో ఆగస్టు 15న జిల్లా స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పున్నూలాల్ మోహలే జెండాను ఎగురవేశారు. ఆ సందర్భంగా శాంతికి ప్రతీకగా భావించే పావురాలను ఎగురవేశారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే, జిల్లా మెజిస్ట్రేట్ రాహుల్ దేవ్ చేతుల్లో నుంచి పావురాలు ఎగిరిపోగా, పోలీసు సూపరింటెండెంట్ గిరిజాశంకర్ చేతుల్లో నుంచి ఎగురవేసిన పావురం మాత్రం కిందపడింది. అదే సమయంలో కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో వీడియో చూసిన పలువురు అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. చనిపోయిన పావురాన్ని ఎగురవేశారా అని ప్రశ్నిస్తున్నారు.


చనిపోయిందా లేదా అస్వస్థతకు గురైందా?

దీనిపై స్పందించిన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జైస్వాల్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఆగస్టు 15న ముంగేలి జిల్లాలోని ప్రధాన జెండా ఎగురవేత కార్యక్రమంలో పావురాన్ని విడుదల చేసే సమయంలో పావురం నేలపై పడిన సంఘటన జరిగింది. ఇలాంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమంలో పావురం నేలమీద పడిన సంఘటన గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జిల్లా స్థాయిలో జరిగే ప్రధాన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అనారోగ్యంతో ఉన్న పావురానికి ఎగురవేసే అవకాశం కల్పించారు.

అందుకే ఇలా జరిగిందని తెలిపారు. అయితే పావురం చనిపోయిందనడంలో నిజం లేదని తెలిపారు. అంతేకాదు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ సంఘటన జరిగి ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని జైస్వాల్ తన లేఖలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


ఇవి కూడా చదవండి..

Viral: ట్రక్ డ్రైవరే కానీ, మహానుభావుడు.. ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఇతడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే..

Picture Puzzle: మీ కళ్ల సామర్థ్యాన్ని చెక్ చేసుకోండి.. ఈ ఫొటోలో చెర్రీల మధ్యనున్న టమాటాను 8 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: ఈ దొంగ తెలివితేటలకు షాకవ్వాల్సిందే.. లోపలికి రాకుండా ఏటీఎమ్‌ను ఎలా లూటీ చేశాడో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 21 , 2024 | 12:44 PM