Share News

Viral: ఒంటరితనంతో అవస్తపడుతున్న మహిళలకు టోకరా! రూ.3 కోట్లు దోచుకున్న వైనం

ABN , Publish Date - Sep 24 , 2024 | 09:02 PM

స్పెయిన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంటరితనంతో బాధపడుతూ డిప్రెషన్‌లోకి వెళ్లిన ఇద్దరు మహిళలకు టోకరా కొట్టిన నిందితులు వారి నుంచి ఏకంగా మూడు కోట్లు దోచుకున్నారు.

Viral: ఒంటరితనంతో అవస్తపడుతున్న మహిళలకు టోకరా! రూ.3 కోట్లు దోచుకున్న వైనం

ఇంటర్నెట్ డెస్క్: స్పెయిన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంటరితనంతో బాధపడుతూ డిప్రెషన్‌లోకి వెళ్లిన ఇద్దరు మహిళలకు టోకరా కొట్టిన నిందితులు వారి నుంచి ఏకంగా రూ. మూడు కోట్లు దోచుకున్నారు. ఈ ఉదంతం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది (Viral).

Viral: కెనడాలో రూ.1.2 కోట్ల శాలరీ! తమ సీక్రెట్ చెప్పేసిన ఎన్నారై దంపతులు!

పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రముఖ హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ ఫ్యాన్ పేజ్‌ను టార్గెట్ చేసిన నిందితులు ఇద్దరు మహిళలను టార్గెట్ చేసుకున్నారు. వారు ఒంటరితనం, డిప్రెషన్‌తో బాధపడుతున్నారని గుర్తించి వలలో వేసుకున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టార్‌ బ్రాడ్ పిట్‌ను పరిచయం చేస్తామని ఆశపెట్టారు. జీవితంలో తోడు వెతుక్కోవడంలో సహకరిస్తామని మభ్యపెట్టారు. ఇలా మెల్లగా వారి నమ్మకం చూరగొన్నాక ఫేక్ ప్రాజెక్టులను చూపించి అందులో పెట్టుబడులు పెడితే మంచి లాభం కళ్ల చూడొచ్చని అన్నారు. వారి మాటలను నమ్మేసిన ఆ ఇద్దరు విడివిడిగా వారు కోరిన మేరకు డబ్బు చెల్లించారు. డబ్బులు అందాక వారు ప్లేట్ వారు ప్లేటు ఫిర్యాయించడంతో మహిళలు మోసపోయామని గుర్తించి షాకయ్యారు. ఆడలూసియాకు చెందిన బాధితురాలు రూ.2 కోట్లు నష్టపోగా, ఉత్తర బాస్క్ కంట్రీలోకి చెందిన మహిళ మరో రూ.కోటి నష్టపోయింది.

Viral: దంపతుల ఏళ్ల నాటి కల.. 17 కోట్లు పెట్టి భారీ ఎస్టేట్ కొంటే..


కాగా, పోలీసులు ఆండలూసియాలో ఉన్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పలు మొబైల్ ఫోన్స్, రెండు కంప్యూటర్లు, బ్యాంక్ కార్డులు, ఒక డైరీ స్వాధీనం చేసుకున్నారు. మహిళలతో ఎలాంటి మాటలు మాట్లాడాలో ఆ డైరీలో ఉన్నట్టు కూడా గుర్తించారు. ఈ క్రమంలో నిందితుల వద్ద నుంచి రూ. 80 వేలు (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) స్వాధీనం చేసుకున్నారు.

Viral: 18 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు తెలిసి షాక్!


‘‘నిందితులు బాధితుల సోషల్ మీడియా ప్రొఫైల్ చూసి వారి మనస్తత్వాన్ని అధ్యయనం చేస్తున్నారు. వారి బలాలు, బలహీలనతలు తెలుసుకుని ఎవరిని టార్గెట్ చేయాలో నిర్ణయిస్తున్నారు. ఆ ఇద్దరు మహిళలు ఒంటరితనంతో, డిప్రెషన్‌తో బాధపడుతున్నారని గుర్తించాకే వారిని టార్గెట్ చేసుకున్నారు’’ అని ఓ పోలీసు అధికారి చెప్పారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?

Legal Awareness: భారతీయ మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన టాప్ 5 చట్టాలు!

Viral: ఢిల్లీలో పర్యటిస్తూ భారత్‌పై బ్రిటీషర్ అవాకులు చవాకులు! వీడియో వైరల్

Read Latest and Viral News

Updated Date - Sep 24 , 2024 | 09:13 PM