Share News

Viral Video: సిగరెట్ వెలిగించుకోవడానికి.. ఖరీదైన కారును ఎలా వాడుకున్నాడో చూస్తే..

ABN , Publish Date - Aug 21 , 2024 | 06:04 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు సిగరెట్‌ను వినూత్నంగా వెలిగించాలని అనుకుంటాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి .. చివరకు ఓ వినూత్న నిర్ణయం తీసుకుంటాడు. రోడ్డుపై ఆగి ఉన్న ఖరీదైన పోర్స్చే కారును చూడగానే..

Viral Video: సిగరెట్ వెలిగించుకోవడానికి.. ఖరీదైన కారును ఎలా వాడుకున్నాడో చూస్తే..

కొందరి తెలివితేటలు, మరికొందరి విచిత్ర నిర్వాకాలు, ఇంకొందరి పిచ్చి పిచ్చి చేష్టలు.. ఇలా అన్నీ కలిసి వీడియోల రూపంలో నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. వ్యూస్, లైక్‌ల కోసం కొందరు చేసే విచిత్ర విన్యాసాలు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సిగరెట్ వెలిగించుకోవడానికి ఖరీదైన కారును ఉపయోగించుకున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘సిగరెట్‌‌ను ఇలాక్కూడా వెలిగించవచ్చా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు సిగరెట్‌ను వినూత్నంగా వెలిగించాలని అనుకుంటాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి .. చివరకు ఓ వినూత్న నిర్ణయం తీసుకుంటాడు. రోడ్డుపై ఆగి ఉన్న ఖరీదైన పోర్స్చే కారును (Porsche car) చూడగానే అతడికి ఓ ఐడియా వస్తుంది. ఈ కారు సాయంతో ఎందుకు సిగరెట్ వెలిగించకూడదు.. అని అనుకుని సమీపానికి వెళ్తాడు.

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


డ్రైవర్ కారును స్టార్ట్ చేయగానే.. వెనుక ఎగ్జాస్ట్ పైపు నుంచి మంటలు వస్తాయి. దీంతో ఆ యువకుడు (man lights cigarette at the car exhaust) కారు వెనుక నిల్చుని సిగరెట్‌ను ఆ మంటలో పెడతాడు. సిగరెట్ అయితే వెలిగింది కానీ.. ఈ క్రమంలో అతడి చేయి కూడా కాలింది. దెబ్బకు కుయ్యో.. మొర్రో.. అనుకుంటూ చేయి పక్కకు తీసి, అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతాడు.

Viral Video: మ్యాగీ చేస్తూ ఫోన్‌లో ప్రియురాలితో మాటలు కలిపిన వ్యక్తి. కాసేపటి తర్వాత స్టవ్‌పై చూడగా..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సిగరెట్‌ను ఇలాక్కూడా వెలిగించవచ్చా’’.. అంటూ కొందరు, ‘‘తిక్క కుదిరిందిగా మొత్తానికి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 54వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2024 | 06:04 PM