Viral News: MS ధోని పేరుతో కొత్త స్కాం..జర జాగ్రత్త
ABN , Publish Date - Apr 26 , 2024 | 01:25 PM
సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు. గతంలో అయోధ్య రామ మందిర్ సహా అనేక కార్యక్రమాల పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేసి అమాయకుల నుంచి డబ్బులు దండుకున్నారు. ఈ క్రమంలో తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) పేరుతో దుండగులు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు చేసి డబ్బులు(money) దోచుకుంటున్నారు.
సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు. గతంలో అయోధ్య రామ మందిర్ సహా అనేక కార్యక్రమాల పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేసి అమాయకుల నుంచి డబ్బులు దండుకున్నారు. ఈ క్రమంలో తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) పేరుతో దుండగులు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు చేసి డబ్బులు(money) దోచుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఆ పోస్టులో “హాయ్, నేను MS ధోని, నేను మీకు నా ప్రైవేట్ ఖాతా నుంచి సందేశం పంపుతున్నాను. నేను ప్రస్తుతం రాంచీ(Ranchi) శివార్లలో ఉన్నాను. నా వ్యాలెట్‌ను మర్చిపోయాను. నేను బస్సులో ఇంటికి తిరిగి రావడానికి మీరు ఫోన్‌పే ద్వారా నాకు రూ. 600 బదిలీ చేయగలరా? నేను ఇంటికి చేరిన వెంటనే డబ్బును తిరిగి పంపుతాను." అని ఉంది. ఆ స్కామర్ "mahi77i2" అనే హ్యాండిల్‌తో సందేశాన్ని పంపారు. అయితే ధోని అధికారిక హ్యాండిల్ "mahi7781" అని ఉంటుంది.
ఇటివల MS ధోని(dhoni) వలె నటించి డబ్బును అభ్యర్థించిన సంఘటన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక వినియోగదారుకు వచ్చింది. దాని గురించి అతను సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో అభిమానుల్లో క్రికెట్‌పై విపరీతమైన క్రేజ్ నెలకొంది. దీన్ని సద్వినియోగం చేసుకుని స్కామర్లు ప్రజలను మోసం చేసేందుకు మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియా సాయం తీసుకుంటున్నారు.
ఈ స్కాం నేపథ్యంలో ప్రజలతోపాటు క్రీడాభిమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు(police) సూచిస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ టిక్కెట్ల విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నట్లు ఇటివల పలు చోట్ల వెలుగులోకి వచ్చాయి. స్కామర్‌లు అసలైన టిక్కెట్ పోర్టల్, బుక్ మై షో లాగా కనిపించే వెబ్‌సైట్‌లను సృష్టించి స్కామ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:
CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం
Read Latest Sports News and Telugu News