Share News

India Vs England: వైజాగ్ టెస్టులో ఓటమి అనంతరం ఇండియా నుంచి దుబాయ్ వెళ్లనున్న టీమ్ ఇంగ్లండ్

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:47 PM

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. అయితే విశాఖ టెస్ట్ మ్యాచ్ ఓటమి అనంతరం ఇంగ్లండ్ టీమ్ ఇండియా నుంచి దుబాయ్ వెళ్లనుంది. ఈ మేరకు ఆ జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది.

India Vs England: వైజాగ్ టెస్టులో ఓటమి అనంతరం ఇండియా నుంచి దుబాయ్ వెళ్లనున్న టీమ్ ఇంగ్లండ్

భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. 106 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. దీంతో ప్రస్తుతం సిరీస్‌లో ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి. సిరీస్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. అయితే విశాఖ టెస్ట్ మ్యాచ్ ఓటమి అనంతరం ఇంగ్లండ్ టీమ్ ఇండియా నుంచి దుబాయ్ వెళ్లనుంది. ఈ మేరకు ఆ జట్టు నిర్ణయం తీసుకుంది. సిరీస్ మధ్యలో వెళ్లిపోవడం ఏంటని అనుకుంటున్నారా?.. మూడవ టెస్ట్ ప్రారంభానికి ముందు దాదాపు 10 రోజుల విరామం ఉండడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు యూఏఈలోని అబుదాబి వెళ్లాలని నిర్ణయించుకుంది.

మూడవ టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌ వేదికగా ఆరంభం కానుంది. దాదాపు 10 రోజుల గ్యాప్ ఉండడంతో సేదదీరేందుకు పర్యాటక జట్టు అబుదాడి వెళ్లాలని భావించింది. ఇందుకు జట్టు మేనేజ్‌మెంట్ కూడా నిర్ణయం తీసుకుంది. దీంతో బెన్ స్టోక్స్, సహా ఇంగ్లండ్ ఆటగాళ్లంతా అబుదాడిలో గోల్ఫ్‌ ఆడనున్నారు. మూడవ మ్యాచ్ ప్రారంభానికి ముందున్న విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోనున్నారు. భారత్‌లో పర్యటనకు ముందు కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లు అబుదాబిలోనే ప్రాక్టీస్ చేశారు. అక్కడే శిబిరాలను ఏర్పాటు చేసుకుని కసర్తతులు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్‌లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ ఒక రోజు ముందుగానే ముగిసింది. వైజాగ్ టెస్ట్ కూడా ఒక ముందుగా ముగిసిన విషయం తెలిసిందే.

Updated Date - Feb 06 , 2024 | 01:51 PM