Share News

Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్.. 2 కీలక మార్పులతో బరిలోకి రోహిత్ సేన

ABN , Publish Date - Dec 25 , 2024 | 03:58 PM

Boxing Day Test: మరో యుద్ధానికి సిద్ధమవుతున్నాయి భారత్-ఆస్ట్రేలియా. ఈ రెండు జట్ల మధ్య ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బాక్సింగ్ డే టెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ డిసైడర్‌గా మారిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్.. 2 కీలక మార్పులతో బరిలోకి రోహిత్ సేన
Team India

IND vs AUS: మరో యుద్ధానికి సిద్ధమవుతున్నాయి భారత్-ఆస్ట్రేలియా. ఈ రెండు జట్ల మధ్య ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బాక్సింగ్ డే టెస్ట్ జరగనుంది. సిరీస్‌ డిసైడర్‌గా మారిన ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్తుంది. నెగ్గితే ఆఖరి మ్యాచ్‌లో మరింత కాన్ఫిడెన్స్‌తో దిగొచ్చు. ఐదో టెస్ట్‌ను డ్రా చేసుకున్నా సిరీస్ సొంతం అవుతుంది. అదే ఎంసీజీలో ఓడితే చివరి మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడి మధ్య ఆడాల్సి ఉంటుంది. అందుకే బాక్సింగ్ డే టెస్ట్‌ను అటు ఆస్ట్రేలియా, ఇటు భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో మన టీమ్ ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగనుందో ఇప్పుడు చూద్దాం..


తెలుగోడి స్థానం డౌటే!

ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగడం ఖాయం. ఆ తర్వాత స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడే అవకాశం కనిపిస్తోంది. ఫామ్‌ను దొరకబుచ్చుకోవడంలో భాగంగా శుబ్‌మన్ గిల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు పంపి, తాను పైన ఆడాలని హిట్‌మ్యాన్ భావిస్తున్నాడట. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి ఆడటం ఖాయం. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఎలాగూ జట్టులో ఉంటాడు. మరో స్పిన్ ఆల్‌రౌండర్ కావాలని అనుకుంటే వాషింగ్టన్ సుందర్ వైపు వెళ్లొచ్చు. అదే జరిగితే నితీష్ బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశం ఉంది.


ఇద్దరిలో ఎవరు?

సీనియర్ స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా పేస్ బాధ్యతల్ని చేపడతాడు. అతడితో పాటు హైదరాబాదీ సీమర్ మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్ పేస్ పనులు చూసుకుంటారు. అయితే వికెట్లు తీస్తున్నా ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్న సిరాజ్‌ స్థానం సందిగ్ధంలో పడింది. ఒకవేళ అతడు వద్దనుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ వైపు వెళ్లొచ్చు. ఓవరాల్‌గా భారత జట్టు కూర్పు బాగుంది. నితీష్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ స్థానాలు మాత్రమే సందేహాస్పదంగా ఉన్నాయి. దీనికి కారణం మెల్‌బోర్న్ గ్రౌండే. అక్కడి పిచ్ మీద పేస్‌తో పాటు స్పిన్‌కూ మంచి సహకారం లభిస్తుంది. అందుకే స్పిన్ ఆల్‌రౌండర్‌గా సుందర్‌ను దింపాలనే యోచనలో ఉందట టీమ్ మేనేజ్‌మెంట్. అతడ్ని ఆడిస్తుందా లేదా అనేది టాస్ టైమ్‌కే క్లారిటీ వస్తుంది.


Also Read:

ఆసీస్ టీమ్‌లోకి జూనియర్ పాంటింగ్.. వీడు మామూలోడు కాదు

అండర్‌-19 ప్రపంచకప్‌కు త్రిష, షబ్నమ్‌

దరఖాస్తులో తప్పులు దొర్లాయేమో!

వాడేసిన పిచ్‌లా?

For More Sports And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 04:00 PM