Share News

CWC 2026: కామన్ వెల్త్ లో క్రీడల తొలగింపు.. భారత్ కే ఎక్కువ లాస్

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:00 PM

కామన్ వెల్త్ క్రీడల సమాఖ్య షాకింగ్ న్యూస్ చెప్పింది. హాకీ , క్రికెట్, రెజ్లింగ్ , బ్యాడ్మింటన్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, నెట్ బాల్, రోడ్ రేసింగ్ వంటి గేమ్స్ ను తొలగించింది. భారత్ కు ఇది చేదు వార్తేనని చెప్పాలి.

 CWC 2026: కామన్ వెల్త్ లో క్రీడల తొలగింపు.. భారత్ కే ఎక్కువ లాస్

ఎడిన్‌బర్గ్: గ్లాస్గో వేదికగా జరగనున్న కామన్ వెల్త్ క్రీడల కోసం భారత్ తో పాటు పలు దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే, కామన్ వెల్త్ క్రీడల సమాఖ్య షాకింగ్ న్యూస్ చెప్పింది. హాకీ , క్రికెట్, రెజ్లింగ్ , బ్యాడ్మింటన్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, నెట్ బాల్, రోడ్ రేసింగ్ వంటి గేమ్స్ ను తొలగించింది. భారత్ కు ఇది చేదు వార్తేనని చెప్పాలి. ఎందుకంటే రెజ్లింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్ వంటి గేమ్స్ లో భారతీయ క్రీడాకారులే ఎక్కువ పతకాలు సాధించేవారు. ఇప్పుడు వీటిని కామన్ వెల్త్ నుంచి తొలగించడంతో పతకాల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది.


భారత్ కే ఎక్కువ నష్టం..

2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన చివరి ఎడిషన్‌లో భారతదేశం తొలగించబడిన చాలా క్రీడలలో అగ్రస్థానంలో నిలిచింది. 22 స్వర్ణాలతో సహా 61 పతకాలను సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. రెజ్లింగ్‌లో 12 పతకాలు (ఆరు స్వర్ణాలు, ఒక రజతం, ఐదు కాంస్యాలు), టేబుల్ టెన్నిస్‌లో ఏడు (నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యం), బ్యాడ్మింటన్‌లో ఆరు (మూడు స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యం), హాకీలో రెండు (వెండి, కాంస్య), స్క్వాష్‌లో రెండు (కాంస్యం), క్రికెట్‌లో ఒకటి (వెండి) ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ లో అత్యధకంగా 12, రెజ్లింగ్ లో 10 పతకాలను భారత్ ఒడిసిపట్టింది.


ఖర్చులు తగ్గించుకునేందుకే..

క్రీడల తొలగింపు నిర్ణయం వ్యయ భారం తగ్గించుకునేందుకేనని తెలుస్తోంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడలకు వందల సంఖ్యలో దేశాల నుంచి క్రీడాకారులు వస్తుంటారు. నిర్వహణ ఏర్పాట్లు సైతం భారీగానే చేయాల్సి ఉంటుంది. ఈ వ్యయం కారణంగా పలు దేశాలు ఈ హక్కులను వదులుకుంటున్నాయి. రానున్న కామన్ వెల్త్ క్రీడలు నిజానికి ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరగాల్సి ఉంది. కానీ, ఆ ఖర్చు ఎక్కువవుతుండటంతో విక్టోరియా ముందుకు రాలేదు. దీంతో స్కాట్లాండ్ లో నిర్వహిస్తున్నారు.

Ranji Trophy: ముంబై రంజీ ట్రోఫీ నుంచి పృథ్వీ షా అవుట్

Updated Date - Oct 22 , 2024 | 03:15 PM