Share News

వీడియో: షాట్ ఆఫ్ ది సిరీస్.. కోహ్లీ బ్యాట్ నుంచి ఇలాంటి మ్యాజిక్ చూసి ఉండరు

ABN , Publish Date - Nov 24 , 2024 | 01:10 PM

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనగానే కవర్ డ్రైవ్, స్ట్రయిట్ డ్రైవ్, ఫ్లిక్ షాట్స్ ఇవే బాగా గుర్తుకొస్తాయి. కానీ అతడి బ్యాట్ నుంచి ఎప్పుడూ చూడని ఓ కొత్త షాట్ వచ్చింది.

వీడియో: షాట్ ఆఫ్ ది సిరీస్.. కోహ్లీ బ్యాట్ నుంచి ఇలాంటి మ్యాజిక్ చూసి ఉండరు

IND vs AUS: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు చెబితే కవర్ డ్రైవ్, స్ట్రయిట్ డ్రైవ్, ఫ్లిక్ షాట్స్ బాగా గుర్తుకొస్తాయి. కానీ అతడి బ్యాట్ నుంచి ఎప్పుడూ చూడని ఓ కొత్త షాట్ వచ్చింది. కళాత్మక షాట్లు ఎక్కువగా ఆడే కింగ్.. బుక్ షాట్స్ దాటి వెళ్లడు. రివర్స్ స్వీప్, అప్పర్ కట్, హెలికాపర్ట్ షాట్, దిల్ స్కూప్ లాంటి డిఫరెంట్ షాట్స్ అతడు పెద్దగా ఆడడు. అలాగని విరాట్ బ్యాట్ కొన్ని షాట్లకే పరిమితమని కాదు. ప్రతి బాల్‌ను మూడ్నాలుగా విధాలుగా బౌండరీకి తరలించే సామర్థ్యం అతడి సొంతం. కానీ ఎక్కువగా సంప్రదాయ షాట్లకే అతడు ప్రాధాన్యత ఇస్తాడు. అలాంటోడి బ్యాట్ నుంచి తాజాగా ఓ కొత్త షాట్ వచ్చింది.


ముందే పసిగట్టి..

పెర్త్ టెస్ట్‌లో కోహ్లీ ఓ డిఫరెంట్ షాట్ కొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి ఊపు మీదున్న విరాట్.. వైవిధ్యమైన షాట్లతో కంగారూ బౌలర్లను ఆటాడుకుంటున్నాడు. సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అతడు కొట్టిన ఓ అప్పర్ షాట్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పాలి. స్టార్క్ ఆఫ్ సైడ్ వేసిన బౌన్సర్‌ను ముందే పసిగట్టి.. వెంటనే తన శరీరాన్ని, బ్యాట్‌ను పైకి లేపాడు. బాల్ తన దగ్గరకు వచ్చేంత వరకు ఆగి ఆఫ్ సైడ్ అప్పర్ కట్ కొట్టాడు. బాల్‌ను అతడు టైమింగ్ చేసిన విధానం, పవర్‌తో లాగి కొట్టిన తీరుకు అది వెళ్లి బౌండరీ లైన్ అవతల పడింది. దీంతో ఇదేం షాట్ అంటూ స్టార్క్ సహా మిగిలిన ప్రత్యర్థి ప్లేయర్లు షాకయ్యారు.


వాటే షాట్..

కోహ్లీ కొట్టిన సిక్స్ వెళ్లి బౌండరీ లైన్ బయట కూర్చున్న గ్రౌండ్ సిబ్బందికి తగిలింది. ఆడియెన్స్ వైపు చూస్తూ బంతిని సరిగ్గా గమించలేదతను. దీంతో బాల్ గట్టిగానే తగిలింది. అయితే సమీపంలో ఉన్న స్పిన్నర్ నాథన్ లియాన్‌తో పాటు ఇతర కంగారూ ఆటగాళ్లు వచ్చి అతడ్ని ఆరాతీశారు. కాగా, కోహ్లీ షాట్ చూసిన నెటిజన్స్ ఇది షాట్ ఆఫ్ ది సిరీస్ అని అంటున్నారు. ఏం కొట్టాడు భయ్యా.. అప్పర్ కట్‌లందు ఇది వేరయా అని కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ అమ్ములపొదిలో ఎన్నో అస్త్రాలు ఉన్నాయని.. అవసరాన్ని బట్టి బయటకు తీస్తుంటాడని, అందులో ఈ షాట్ కూడా ఒకటని చెబుతున్నారు. ఇక, భారత్ ప్రస్తుతం 5 వికెట్లకు 371 పరుగులతో ఉంది. కోహ్లీ (47 నాటౌట్)తో పాటు సుందర్ (14 నాటౌట్) క్రీజులో ఉన్నారు.


Also Read:

ఫేవరెట్‌ గుకేష్‌

టైటాన్స్‌కు చుక్కెదురు

సాత్విక్‌ జోడీ పరాజయం

For More Sports And Telugu News

Updated Date - Nov 24 , 2024 | 01:18 PM