RCB vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. తుది జట్లు ఇవే!
ABN , Publish Date - Apr 06 , 2024 | 07:14 PM
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
జైపూర్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals vs Royal Challengers Bengaluru) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. అదే సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ బ్యాటింగ్ లైనప్‌లో ఒక మార్పు చేసింది. సౌరవ్ చౌహాన్ ను తుది జట్టులోకి తీసుకుంది. హ్యాట్రిక్ విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. నాల్గింటిలో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎనిమిదో స్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటివరకు 30 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా ఆర్సీబీ 15 మ్యాచ్‌ల్లో గెలవగా.. రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది.
తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
SRH vs CSK: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. సీఎస్కే ఓడిపోయిందని ఏకంగా..
SRH vs CSK: ధోని క్రీజులోకి రాకుండా కమిన్స్ వ్యూహం పన్నాడా..? అందుకే రివ్యూకు వెళ్లలేదా..?