Share News

Shreyas Iyer: అయ్యర్ కావాలనే బయటకు వచ్చాడా.. పెద్ద ప్లానింగే ఇది

ABN , Publish Date - Nov 04 , 2024 | 06:02 PM

Shreyas Iyer: ఐపీఎల్-2025 రిటెన్షన్ ప్రక్రియ ముగియడంతో మెగాఆక్షన్ మీద ఇప్పుడు అందరి ఫోకస్ షిప్ట్ అయింది. వేలం బరిలో ఎందరు స్టార్లు ఉన్నా రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మీదే అందరి గురి ఉంది. ముఖ్యంగా కేకేఆర్‌ను విన్నర్‌గా నిలిపిన అయ్యర్ ఎంత ధర పలుకుతాడనేది ఆసక్తికరంగా మారింది.

Shreyas Iyer: అయ్యర్ కావాలనే బయటకు వచ్చాడా.. పెద్ద ప్లానింగే ఇది

IPL 2025 Auction: ఐపీఎల్ ట్రోఫీ గెలవడం అంత ఈజీ కాదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ వంటి టీమ్స్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ను ముద్దాడలేదు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లాంటి బడా జట్లను దాటి ఛాంపియన్‌గా నిలవడం మామూలు విషయం కాదు. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం అది సాధ్యమేనని నిరూపించాడు. అతడి సారథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ విన్నర్‌గా నిలిచింది కోల్‌కతా నైట్ రైడర్స్. ఫస్ట్ మ్యాచ్‌ నుంచి ఫైనల్ ఫైట్ వరకు టీమ్‌ను అద్భుతంగా నడిపించి విజేతగా నిలబెట్టాడు అయ్యర్. అలాంటోడ్ని కేకేఆర్ రీటెయిన్ చేసుకోకవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. అతడ్ని ఎలా వదులుకున్నారని షాక్ అవుతున్నారు. అయితే కేకేఆర్ నుంచి అయ్యర్ కావాలనే బయటకు వచ్చాడని తెలుస్తోంది.


తప్పు ఎవరిది?

సాధారణంగా మంచి ప్లేయర్లను ఏ ఫ్రాంచైజీ కూడా వదులుకోదు. అందునా టీమ్‌ను ఛాంపియన్ చేసిన కెప్టెన్‌ను రిలీజ్ చేయాలని ఎవరూ అనుకోరు. కానీ అయ్యర్‌ను కేకేఆర్ రీటెయిన్ చేసుకోకపోవడం షాకింగ్‌గా మారింది. మంచి కెప్టెన్, స్టార్ బ్యాటర్, టీమ్‌కు కప్పు అందించినోడ్ని ఎందుకు వదులుకున్నారంటూ అటు అభిమానుల నుంచి ఇటు ఆడియెన్స్, ఎక్స్‌పర్ట్స్ వరకు అంతా కోల్‌కతా యాజమాన్యం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వాళ్ల తప్పేమీ లేదు.. ఇది అయ్యర్ తీసుకున్న డెసిషన్ అని క్లారిటీ వచ్చేసింది. అతడి లెక్క మరోలా ఉందని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ బయటపెట్టారు.


డబ్బుల కోసమే..

డబ్బుల కోసమే అయ్యర్ తమ టీమ్‌ను విడిచి వెళ్లాడని వెంకీ మైసూర్ అన్నారు. రిటెన్షన్ లిస్ట్‌లో అతడికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చామని, అతడు తమ కెప్టెన్ అని చెప్పిన కేకేఆర్ సీఈవో.. శ్రేయస్‌ను కొనసాగించాలనుకున్నామని తెలిపాడు. కానీ వేలంలో తన విలువ, ఎంత డబ్బు పలుకుతాననేది అతడు పరీక్షించుకోవాలని అనుకున్నాడని స్పష్టం చేశాడు. దీంతో అయ్యర్ కావాలనే బయటకు వచ్చాడని, డబ్బుల కోసమే అతడు ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. కెప్టెన్‌గా ఒక్క కప్పు గెలిచినందుకు ఇలా చేయడం సరికాదని చురకలు అంటిస్తున్నారు.


సెగ తగలడం పక్కా!

పిలిచి కెప్టెన్సీ ఇచ్చి ఎంకరేజ్ చేసిన జట్టును ఇలా వదిలి వెళ్లిపోవడం కరెక్ట్ కాదని అయ్యర్ మీద కేకేఆర్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. మరోవైపు టీమ్‌లో కంటిన్యూ అయ్యేందుకు శ్రేయస్ ఏకంగా రూ.30 కోట్లు డిమాండ్ చేశాడని, ఇది వర్కౌట్ కాకపోవడంతో బయటకు వచ్చేశాడని ఊహాగానాలు వస్తున్నాయి. అతడు మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లడం ఖాయమని.. ఆ టీమ్‌తో మంతనాలు కూడా జరుపుతున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. అయ్యర్ ఏ టీమ్‌కు వెళ్తాడో తెలియదు గానీ ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యాకు జరిగినట్లు వచ్చే సీజన్‌లో కేకేఆర్ ఫ్యాన్స్ నుంచి శ్రేయస్‌కు విమర్శల సెగ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.


Also Read:

పంత్‌కు రూ.50 కోట్లు.. పాత రికార్డులకు పాతర

చిక్కుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్లు

కెప్టెన్‌గానూ విఫలమయ్యా..

For More Sports And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 06:12 PM