Women's Team Clinches : దీప్తి ఆల్‌రౌండ్ షో
ABN , Publish Date - Dec 28 , 2024 | 03:16 AM
వెస్టిండీ్‌సతో ఆఖరి వన్డేలోనూ భారత మహిళల జట్టు సత్తా చాటింది.

భారత్‌దే చివరి వన్డే
3-0తో సిరీస్ కైవసం
వడోదర: వెస్టిండీ్‌సతో ఆఖరి వన్డేలోనూ భారత మహిళల జట్టు సత్తా చాటింది. మొదట బౌలింగ్, ఆపై బ్యాటింగ్‌తో దీప్తి శర్మ (6/31, 48 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 39 నాటౌట్) ఆల్‌రౌండ్ షో కనబర్చడంతో చివరి వన్డేలో హర్మన్ సేన 5 వికెట్ల తేడాతో విండీ్‌సను చిత్తుచేసింది. తద్వారా సిరీ్‌సను 3-0తో కైవసం చేసుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్లను భారత బౌలర్లు దీప్తి శర్మ, రేణుకా సింగ్ (4/29) బెంబేలెత్తించారు. దీంతో విండీస్ 38.5 ఓవర్లలోనే 162 పరుగులకు కుప్పకూలింది. చినెల్లె హెన్రీ (61) అర్ధ సెంచరీ చేసింది. ఛేదనలో దీప్తి శర్మ (39 నాటౌట్) రిచా (23 నాటౌట్) చెలరేగడంతో 28.2 ఓవర్లలోనే 167/5 చేసి గెలిచింది. దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా, రేణుక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచారు.