Share News

Virat Kohli: ధోనీ, నేను కలిసి ఆడడం ఇదే చివరి సారేమో.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!

ABN , Publish Date - May 18 , 2024 | 05:21 PM

మరికొద్ది గంటల్లో ఈ సీజన్‌లోని మరో కీలకమైన మ్యాచ్ తెర మీదకు రానుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ సీజన్‌లోని తమ చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి నేరుగా నాకౌట్‌కు వెళ్లాలని చెన్నై భావిస్తోంది.

Virat Kohli: ధోనీ, నేను కలిసి ఆడడం ఇదే చివరి సారేమో.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
Virat Kohli with MS Dhoni

మరికొద్ది గంటల్లో ఈ సీజన్‌లోని (IPL 2024) మరో కీలకమైన మ్యాచ్ తెర మీదకు రానుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ సీజన్‌లోని తమ చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి (RCB vs CSK). పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి నేరుగా నాకౌట్‌కు వెళ్లాలని చెన్నై భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ రేస్‌పై ఆశలు నిలుపుకోవాలని బెంగళూరు కోరుకుంటోంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే చెన్నై నేరుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఆటగాడు కోహ్లీ (Virat Kohli) కీలక వ్యాఖ్యలు చేశాడు.


టీమిండియా మాజీ క్రికెటర్, తనకు స్నేహితుడు అయిన ధోనీ (MS Dhoni) రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు. ``మహీ భాయ్‌తో మరోసారి మ్యాచ్ ఆడబోతున్నా. నాకు తెలిసి మేమిద్దరం కలిసి ఆడడం ఇదే చివరిసారేమో. మేమిద్దరం టీమిండియా తరఫున ఎన్నో మ్యాచ్‌లు కలిసి ఆడాం. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాం. ధోనీ ఇకపై ఆడతాడో? లేదో? నాకు తెలియదు. ఏదేమైనా ఈ మ్యాచ్ అభిమానులకు గొప్ప అనుభూతిని మిగులుస్తుంద``ని కోహ్లీ వ్యాఖ్యానించాడు (MS Dhoni Retirement).


అలాగే ఐపీఎల్‌లోని ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ తన అభిప్రాయాలను తెలియజేశాడు. రోహిత్‌ అభిప్రాయంతో ఏకీభవించాడు. ``ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో రోహిత్ వ్యాఖ్యలు సరైనవే. ఆ రూల్ వల్ల జట్టు సమతూకం దెబ్బతింటోంది. నేనే కాదు.. చాలా జట్లలోని ఆటగాళ్లు ఇలాగే ఫీల్ అవుతున్నార``ని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి..

Rohit Sharma: ఆ ఒక్క ఆడియో నా కొంపముంచింది.. అతడ్ని వేడుకున్న రోహిత్ శర్మ


Hardik Pandya: హార్దిక్ పాండ్యాను బ్యాన్ చేసిన బీసీసీఐ.. అసలు కారణం ఇదే!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2024 | 05:21 PM