Share News

Rare Disease: ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు.. బాలుడికి సాయం చేయండి.. పెద్ద మనసు చాటుకోండి!

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:30 AM

మంచిర్యాల: జిల్లాలో ఓ పసివాడికి అరుదైన వ్యాధి సోకింది. 16 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్ వేస్తే తప్ప బాబు బతికే అవకాశం లేదని వైద్యులు తెలపడంతో బాలుని తల్లి దండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంత డబ్బు పెట్టి వైద్యం చేయించే స్తోమత లేక దాతల సహయం కోసం ఎదురుచూస్తున్నారు.

 Rare Disease: ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు.. బాలుడికి సాయం చేయండి.. పెద్ద మనసు చాటుకోండి!

మంచిర్యాల: జిల్లాలో ఓ పసివాడికి (Child) అరుదైన వ్యాధి (Rare Disease) సోకింది. 16 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్ (Rs.16 crores injection) వేస్తే తప్ప బాబు బతికే అవకాశం లేదని వైద్యులు (Doctors) తెలపడంతో బాలుని తల్లి దండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంత డబ్బు పెట్టి వైద్యం చేయించే స్తోమత లేక దాతల సహయం కోసం ఎదురుచూస్తున్నారు. మంచిర్యాల జిల్లా (Mancherial), కోటపల్లి మండలం (Kotapalli Mandal), వెంచపల్లి గ్రామానికి (Venchapalli Village) చెందిన పడాల సతీశ్‌ (Satish)-రవళి (Ravali) దంపతులకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వారికి పండంటి మగబిడ్డ జన్మించాడు. శ్రేయాన్‌ అని నామకరణం చేసుకున్నారు. కానీ వారి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. బాలుడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. బాబులో ఎదుగుదల కూడా లేదు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లి చూపించగా.. కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన ‘‘స్పైనల్‌ మస్య్కూలర్‌ అట్రాసి టైప్‌ 2’’ అనే వ్యాధి సోకిందని చెప్పడంతో తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. చికిత్సలో భాగంగా బాబుకు రెండేళ్లు నిండేలోపు అత్యధునిక ‘జోల్‌జన్‌స్మా’ అనే ఇంజక్షన్‌ చేయించాలని వైద్యులు సూచించారు.


అయితే ఆ ఒక్క ఇంజక్షన్ ఖరీదు రూ. 16 కోట్లు ఉంటుందని, విదేశాల్లోనే దొరుకుతుందని డాక్టర్లు చెప్పడంతో బాబు తల్లిదండ్రులు ఏమీ చేయలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చికిత్స తీసుకోకుంటే తీవ్రమైన అనారోగ్యంతో మంచానికే పరిమితమవుతాడని, ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దాతల సహాయం కోసం వేడుకుంటున్నారు. ప్రస్తుతం బాలుడి వయసు 13 నెలలు. తమకున్న ఎకరం పొలం సాగు చేసుకొని బతికే తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం? అని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


బాలుడి తండ్రి సతీష్ మాట్లాడుతూ.. బాబు బోర్లా పడటం లేదని, బలహీనంగా ఉన్నాడంటూ ఆర్నెల్ల క్రితం మంచిర్యాల ఆస్పత్రిలో చూపించామని, గత ఏప్రిల్‌ 29న హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రికి తీసుకువెళ్లామని చెప్పాడు. పరీక్షించిన వైద్యులు బాబు ‘‘స్పైనల్‌ మస్య్కూలర్‌ అట్రాసి టైప్‌ 2’’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని నిర్ధారించారని, చిన్నారికి రెండేళ్ల వయసు నిండేలోపు జోల్‌జన్‌స్మా ఇంజక్షన్‌ చేయించాలని, అప్పుడే ఫలితం ఉంటుందని, ఇంజక్షన్‌ను అమెరికా నుంచి తెప్పించాలని, దాని ఖరీదు రూ.16 కోట్లు ఉంటుందని చెప్పారన్నాడు. ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి తమ కుమారుడిని బతికించాలని ఆయన వేడుకుంటున్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

చిత్తూరు కార్పొరేషన్‌లో వైసీపీకి భారీ షాక్

జగన్ హయాంలో భారీగా ఇసుక దోపిడీ..

వైసీపీ నేతల బంధువులకే మార్కులు..

BRS పార్టీ మనుగడ కష్టమేనా?

జగన్‌కు మాజీ మంత్రి బిగ్ షాక్?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 05 , 2024 | 12:25 PM