Share News

Rahul Gandi: తెలంగాణలో రెండు చోట్ల రాహుల్ బహిరంగ సభలు

ABN , Publish Date - May 05 , 2024 | 08:05 AM

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఉదయం 11 గంటలకు నిర్మల్‌కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

Rahul Gandi: తెలంగాణలో రెండు చోట్ల రాహుల్ బహిరంగ సభలు

హైదరాబాద్: ఎన్నికల ప్రచారం (Election Campaigh)లో భాగంగా కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఉదయం 11 గంటలకు నిర్మల్‌ (Nirmal)కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి (Erravalli)లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఎన్డీయే (NDA) హయాంలోని వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. కాంగ్రెస్ పాంచ్ న్యాయ్, పచ్చిస్ గ్యారెంటీలను రాహుల్ గాంధీ వివరించనున్నారు. కాగా రాహుల్ గాంధీతో పాటు సభలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.


నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లురవి (Mallu Ravi) ప్రచారం కోసం రాహుల్ గాంధీ వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4:00 గంటలకు హెలికాప్టర్ ద్వారా బీచ్పల్లి పదవ బెటాలియన్‌కు వస్తారు. ఆయనతోపాటు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఎర్రవల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ బయలుదేరతారు. 4:30లకు ఎర్రవల్లి చౌరస్తాలో జన జాతర బహిరంగ సభ జరుగుతుంది. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


కాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. పార్లమెంట్‌ ఎన్ని కల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పా టుచేసిన జనజాతర బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా సీఎం జిల్లాకు చేరుకోనున్నా రు. ఆసిఫాబాద్‌పట్టణంలోని ప్రేమలగార్డెన్‌సమీపంలో సభాస్థలిని ఏర్పాటు చేశారు. జనజాతర బహిరంగసభలో పాల్గొని కాంగ్రెస్‌పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క తరపున ప్రజలనుద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు.


భారీగా జనసమీకరణ..: ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల పరిధిలో సీఎం సభకు 25వేలమందిని తరలించేందుకు పార్టీనాయకులు ఏర్పాట్లు చేస్తు న్నారు. కాంగ్రెస్‌పార్టీ జిల్లాఅధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావ్‌ నేతృత్వంలో భారీగా జనాన్ని సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు జన సమీకరణ బాధ్యతలను అప్పగించారు

ఏర్పాట్లు పూర్తి..: ముఖ్యమంత్రి సభకు వచ్చే ప్రజలకోసం ప్రత్యేక షామి యానాలను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్‌, సభాస్థలి పనులను మంత్రి సీతక్క, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావ్‌, జిల్లాలోని ఆసి ఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఎస్పీ సురేష్‌కుమార్‌ నేతృత్వంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ప్రత్యేక పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొననున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదు: సీఎం రమేష్

స్కీం వెనుక స్కాం

8వ తేదీకి రైతు భరోసా పూర్తి

రాష్ట్రానికి నేడు షా... రేపు మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 08:08 AM