Share News

Hyderabad: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్‌

ABN , Publish Date - Dec 13 , 2024 | 06:17 AM

తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.

Hyderabad: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైందని, బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైందని ఆయన అన్నారు. ‘‘తెలంగాణ వేడుకల్లో జానపదం కనుమరుగవుతోంది. బాసరలో లడ్డూలు అందకుండా పోతున్నయి.


కొమురవెల్లి ప్రసాదంలో నాణ్యత లేకుండా పోతున్నది. వేములవాడలో మొక్కులుగా చెల్లించే కోడెలు మాయమైపోతున్నయి. పండుగల మీద ఆంక్షలు పెరుగుతున్నయి. ఎక్కడపడితే అక్కడ ఆలయాలపై దాడులు జరుగుతున్నయి’’ అని ఎక్స్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేస్తోందా? లేక ప్రభుత్వమే ఈ సాంస్కృతిక దాడిని చేయిస్తోందా? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Updated Date - Dec 13 , 2024 | 06:17 AM