Share News

Bhatti Vikramarka: కాంగ్రెస్‌ నేతలు అర్బన్‌ నక్సల్సా?

ABN , Publish Date - Sep 22 , 2024 | 03:37 AM

కాంగ్రెస్‌ పార్టీ నేతలను అర్బన్‌ నక్సల్స్‌, విభజనవాదులు, అవినీతిపరులు అని ప్రధాని మోదీ అనడం ఆయన స్థాయికి తగదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Bhatti Vikramarka: కాంగ్రెస్‌ నేతలు అర్బన్‌ నక్సల్సా?

  • ప్రధాని మోదీ వ్యాఖ్యలు సరికావు: భట్టి

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ నేతలను అర్బన్‌ నక్సల్స్‌, విభజనవాదులు, అవినీతిపరులు అని ప్రధాని మోదీ అనడం ఆయన స్థాయికి తగదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సుదీర్ఘమైన జాతీయోద్యమ నేపథ్యం, త్యాగాలు చేసిన చరిత్ర ఉందని శనివారం పేర్కొన్నారు.


దేశ సమగ్రత, సమైక్యత, ప్రజాస్వామిక విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్న కాంగ్రె్‌సపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. కాగా మైనింగ్‌, గ్రీన్‌ పవర్‌ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం అమెరికా, జపాన్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 22 నుంచి అక్టోబరు 4 వరకు ఈ పర్యటన కొనసాగుతుంది.

Updated Date - Sep 22 , 2024 | 03:37 AM