Share News

Cyber Fraud: నార్కోటిక్స్‌ సీపీగా నమ్మించి.. డ్రగ్స్‌ పేరుతో భయపెట్టి

ABN , Publish Date - Aug 10 , 2024 | 04:22 AM

‘‘ఢిల్లీ నుంచి నార్కోటిక్స్‌ పోలీస్‌ కమిషనర్‌ను మాట్లాడుతున్నాను. మీ పేరుతో ఢిల్లీలో డ్రగ్స్‌ పార్సిల్‌ దొరికింది.

Cyber Fraud: నార్కోటిక్స్‌ సీపీగా నమ్మించి.. డ్రగ్స్‌ పేరుతో భయపెట్టి

  • 80 ఏళ్ల వృద్ధురాలి నుంచి రూ. 22లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘ఢిల్లీ నుంచి నార్కోటిక్స్‌ పోలీస్‌ కమిషనర్‌ను మాట్లాడుతున్నాను. మీ పేరుతో ఢిల్లీలో డ్రగ్స్‌ పార్సిల్‌ దొరికింది. మిమ్మల్ని అరెస్టు చేయాలని ఆర్డర్లు ఉన్నాయి’’ అంటూ ఓ 80 ఏళ్ల వృద్ధురాలిని బెదిరించి సైబర్‌ నేరగాళ్లు రూ. 22లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన వృద్ధురాలికి గురువారం రాత్రి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది.


ఢిల్లీ నార్కోటిక్‌ విభాగం నుంచి సీపీని మాట్లాడుతున్నానని, మీ పేరుతో మాదక ద్రవ్యాల పార్సిల్‌ ఢిల్లీకి వెళ్లిందని ఆమెను భయపెట్టారు. వృద్ధురాలిపై కేసు నమోదు చేస్తున్నామని బెదిరించారు. ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును ఆర్‌బీఐ ఆధీనంలో ఉన్న ఖాతాకు వెంటనే బదిలీ చేయాలని, లేదంటే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దాంతో వారి మాటలు నమ్మిన వృద్ధురాలు తన బ్యాంకు ఖాతాల్లోని రూ. 22లక్షలను వారు చెప్పిన ఖాతాల్లోకి మళ్లించింది. ఆ తర్వాత అవతలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - Aug 10 , 2024 | 04:22 AM