Share News

Hyderabad: ‘అంబేడ్కర్‌’లో ఫైన్‌ఆర్ట్స్‌ వర్సిటీకి భూ కేటాయింపు

ABN , Publish Date - Sep 25 , 2024 | 10:57 AM

జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లోని డాక్టర్‌ బి ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్‌ లాల్‌ నెహ్రు అర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీకి (జేఎన్‌ఎఫ్‌ఏయూ) కేటాయించాలంటూ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలిచ్చారు. ఈ మేర కు ఇరు యూనివర్సిటీల రిజిస్ర్టార్లకు లేఖ రాశారు.

Hyderabad: ‘అంబేడ్కర్‌’లో ఫైన్‌ఆర్ట్స్‌ వర్సిటీకి భూ కేటాయింపు

- పదెకరాలను ఖరారు చేయాలని ఆదేశం

హైదరాబాద్‌ సిటీ: జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లోని డాక్టర్‌ బి ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్‌ లాల్‌ నెహ్రు అర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీకి (జేఎన్‌ఎఫ్‌ఏయూ) కేటాయించాలంటూ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలిచ్చారు. ఈ మేర కు ఇరు యూనివర్సిటీల రిజిస్ర్టార్లకు లేఖ రాశారు. ఐదెకరాల లోపు విస్తీర్ణంలోనే ప్రస్తుతం మసబ్‌ట్యాంక్‌లో జేఎన్‌ఎఫ్ఏయూ ఉన్నదని, అందులో కొంత మేరకు ఉన్నత విద్యా మండలి వినియోగించుకుంటుందని లేఖలో పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Harsha Sai: హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్.. యువతి పట్ల ఎంత నీచంగా ప్రవర్తించాడంటే..


ఫైన్‌ ఆర్ట్స్‌, ఆర్కిటెక్చర్‌, అర్భన్‌ ప్లానింగ్‌ కోర్సులతో ప్రత్యేకమై ఈ యూనివర్సిటీ దేశంలోనే ఒకటని, భవిష్యత్తు అవసరాల అనుగుణంగా కోర్సులు పెంచాల్సిన అవసరముందని, ముఖ్యమైన పరిశోధన కేంద్రంగా జేఎన్‌ఎఫ్ఏయూ మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయించిందని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా భూ కేటాయింపులకు చర్యలు తీసుకోవాలని అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ రిజిస్ర్టార్‌కు ఆదేశాలిచ్చారు. అయితే ఈ నిర్ణయం పట్ల ఇప్పటికే అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో అన్నీ ఉద్యోగ సంఘాల నాయకులు జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పడి ఆందోళన చేస్తున్న విషయం విదితమే.


.......................................................

ఈ వార్తను కూడా చదవండి:

.......................................................

Hyderabad: మీ పర్సు మా దగ్గరుంది!

- పోగొట్టుకున్న వారు రావాలంటున్న సుల్తాన్‌బజార్‌ పోలీసులు

హైదరాబాద్: మీ పర్సు పోయిందా..? అయితే వెంటనే సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌(Sultan Bazar Police Station)కు రండి అంటున్నారు పోలీసులు. కోఠి(Kothi)లో పర్సు పోగొట్టుకున్న వారు కంగారు పడాల్సిన పనిలేదన్నారు. విలువైన బంగారంతో పాటు నగదు ఉన్న పర్సు మా దగ్గరుందన్నారు. అయినా పర్సు ఎవరిదనే దానిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోలీసులు సీఆర్‌ఫీసీ 102 కింద కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారు.

city5.jpg


సుల్తాన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కోఠి ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ పక్కనే ఉన్న సులబ్‌ కాంప్లెక్స్‌ ఫూట్‌పాత్‌పై మంగళవారం హ్యాండ్‌ పర్స్‌ కనిపించింది. స్థానికులు పర్సును తెరిచి చూడగా అందులో మూడున్నర తులాల బంగారం, వెయ్యి రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించి సుల్తాన్‌ బజార్‌ పోలీసులకు అప్పగించారు. రాత్రి వరకు తమ పర్సు పోయిందని ఫిర్యాదు రాకపోవడంతో పోలీసులు ప్రకటన చేశారు. పర్సు పోలీస్‌ స్టేషన్‌ లో ఉందని, పోగొట్టుకున్న వారు సంప్రదించాలని ఎవరూ రాకుంటే కేసు నమోదు చేస్తామని ఇన్‌స్పెక్టర్‌ పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

ఇదికూడా చదవండి: రేవంత్‌రెడ్డి.. కోర్టుకు రండి!

ఇదికూడా చదవండి: తెలంగాణలో రేవంత్‌ కుటుంబం దోపిడీ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2024 | 10:57 AM