Share News

Hyderabad: క్యాబ్‌ డ్రైవర్‌కు రూ.లక్ష జరిమానా.. పరిహారం చెల్లించాలని ఆదేశించిన జిల్లా ఫోరం 3

ABN , Publish Date - Apr 23 , 2024 | 09:40 AM

క్యాబ్‌ను బుక్‌ చేసుకున్న ప్రయాణికుడి పట్ల కారు డ్రైవర్‌(Car driver) దురుసుగా ప్రవర్తించి వారిని మధ్యలో దింపివేయడంపై ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారుడికి కలిగిన మానసిక వేదనకు పరిహారంగా రూ.లక్ష చెల్లించాలని హైదరాబాద్‌(Hyderabad) జిల్లా వినియోగదారుల ఫోరం 3 ఆదేశాలు జారీ చేసింది.

Hyderabad: క్యాబ్‌ డ్రైవర్‌కు రూ.లక్ష జరిమానా..  పరిహారం చెల్లించాలని ఆదేశించిన జిల్లా ఫోరం 3

హైదరాబాద్‌ సిటీ: క్యాబ్‌ను బుక్‌ చేసుకున్న ప్రయాణికుడి పట్ల కారు డ్రైవర్‌(Car driver) దురుసుగా ప్రవర్తించి వారిని మధ్యలో దింపివేయడంపై ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారుడికి కలిగిన మానసిక వేదనకు పరిహారంగా రూ.లక్ష చెల్లించాలని హైదరాబాద్‌(Hyderabad) జిల్లా వినియోగదారుల ఫోరం 3 ఆదేశాలు జారీ చేసింది. ఆబిడ్స్‌కు చెందిన శామ్యూల్‌ వ్యక్తిగత పనిమీద వెళ్లేందుకు 2021 అక్టోబర్‌ 19న ఓ కంపెనీకి చెందిన క్యాబ్‌ను 4గంటల కోసం బుక్‌ చేసుకున్నాడు. ఉదయం 10 గంటలకు క్యాబ్‌ ఇంటి వద్దకు రాగా, శామ్యూల్‌, అతడి భార్య, మరో వ్యక్తి కారులో ఎక్కారు. ఏసీ వేయాలని సూచించారు. ప్రయాణం చేస్తున్న సమయంలో ఏసీ వేయడానికి నిరాకరించిన క్యాబ్‌ డ్రైవర్‌ దురుసుగా మాట్లాడాడు. కేవలం 5 కిలోమీటర్లు ప్రయాణించగానే క్యాబ్‌ను ఎగ్జిట్‌ చేయాలని సూచించాడు. దీనికి రూ. 861 చార్జీ వసూలు చేశాడు. ఈ సంఘటన తర్వాత సదరు కంపెనీ కస్టమర్‌ కేర్‌ను సంప్రదిస్తే సరైన సమాధానం రాలేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇదికూడా చదవండి: Kavitha: నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ

ఈ సంఘటనతో మానసిక వేదనకు గురయ్యామని, అక్కడి నుంచి ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సమయం, డబ్బు వృథా అయిందని, దానికి పరిహారం కోరుతూ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ఇరుపక్షాల వాదనలు విన్న హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరం జరిగిన సేవాలోపాన్ని గుర్తించింది. ప్రయాణికుడికి జరిగిన మానసికవేదనకు పరిహారంగా రూ. లక్ష పరిహారంతోపాటు కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5వేలు చెల్లించాలని తీర్పును వెలువరించింది.

ఇదికూడా చదవండి: Hyderabad: హనుమాన్‌ విజయయాత్ర.. నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

Updated Date - Apr 23 , 2024 | 09:40 AM