Share News

Bonalu Festival 2024: బోనాల సందడి షురూ.. తొలి బోనం ఎప్పుడంటే?

ABN , Publish Date - Jul 05 , 2024 | 03:19 PM

Telangana: ఆషాడ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో బోనాల సందడి మొదలవుతుంది. అమ్మ బైలెల్లినాదే అంటూ అమ్మవారికి భక్తులు చీర, సారెలు, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా హైదరాబాద్‌లో బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. గోల్కోండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర షురూ అవుతుంది.

Bonalu Festival 2024: బోనాల సందడి షురూ.. తొలి బోనం ఎప్పుడంటే?
Telangana Bonalu Festival 2024

హైదరాబాద్, జూలై 5: ఆషాడ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో బోనాల (Bonalu Festival 2024) సందడి మొదలవుతుంది. అమ్మ బైలెల్లినాదే అంటూ అమ్మవారికి భక్తులు చీర, సారెలు, నైవేద్యాలతో బోనాలు సమర్పిస్తుంటారు. ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా హైదరాబాద్‌లో బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర షురూ అవుతుంది. ఈనెల 7వ తేదీ నుంచి అంటే ఆదివారం గోల్కొండ ఖిల్లా నుంచి జాతర ప్రారంభంకానుంది. ఇప్పటికే బోనాల పండుగ కోసం పెద్ద ఎత్తున సర్కార్ (Telangana Government) ఏర్పాట్లు చేసింది.

YSRCP: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి బిగ్ షాక్.. హ్యాండిచ్చేశారుగా..!


గోల్కొండ నుండే రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగ మొదలవుతుంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు ఒక్కరోజే సమయం ఉండడంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లుు పూర్తి అయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సమీక్షతో భారీ ఏర్పాట్లు జరిగాయి. గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహాకాళి బోనాలను నిర్వహించడం జరుగుతుంది. ఆషాఢ మాసం చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో పూజలు చేసి ఉత్సవాలను ముగింపు పలుకుతారు.


ఇవి కూడా చదవండి...

Harish Rao: ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు.. అప్రజాస్వామ్యపాలన

TDP MP: ప్రత్యేకత చాటుకున్న ఎంపీ కలిశెట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 05 , 2024 | 04:11 PM