Share News

Venu Swamy: శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం.. అల్లు అర్జున్ జాతకంపై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:59 PM

sandhya theatre stampede case: కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను జ్యోతిష్యుడు వేణు స్వామి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హీరో అల్లు అర్జున్ జాతకం ప్రస్తుతం ఏం బాగోలేదన్నారు.

Venu Swamy: శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం.. అల్లు అర్జున్ జాతకంపై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
Astrologer Venu Swamy

హైదరాబాద్, డిసెంబర్ 25: పుష్ప 2 చిత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి.. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి బుధవారం పరామర్శించారు. అనంతరం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అతడి తండ్రి భాస్కర్‌ను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కును ఆర్థిక సాయాన్ని వేణు స్వామి అందజేశారు. శ్రీతేజ్ ఆరోగ్యం కోసం ఈ వారం రోజుల్లో మృత్యుంజయ హోమాన్ని.. అది కూడా తన సొంత ఖర్చులతో నిర్వహిస్తానని ఆయన తెలిపారు.

అయితే పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ జాతకంలో శని ఉండడం వల్ల.. ఈ సంఘటన చోటు చేసుకుందని వేణు స్వామి వివరించారు. వచ్చే ఏడాది మార్చి 29వ తేదీ వరకు అల్లు అర్జున్ జాతకం ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. కాస్తా జాగ్రత్తగా ఉండాలంటూ హీరో అల్లు అర్జున్‌కు వేణు స్వామి సూచించారు. ఇక ఎవరు కావాలని ఏదీ చేయరన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు ఉంటాయన్నారు.


శ్రీతేజ్‌పైన అతడి తండ్రి చేయ్యి వేయగానే.. అది చూసి తన కళ్లలో నుంచి నీళ్లు వచ్చాయని వేణు స్వామి ఆవేదనతో చెప్పారు. శ్రీతేజ కోలుకుంటాడని తనకు నమ్మకం ఉందన్నారు. అతడు ఖచ్చితంగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానన్నారు. శ్రీతేజ్ సోదరికి తాను ఈ ఆర్థిక సాయాన్ని అందజేసినట్లు వివరించారు.

Also Read : కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ


తాను టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలకు ముహూర్తాలు సైతం పెట్టానని ఈ సందర్బంగా వేణు స్వామి గుర్తు చేసుకున్నారు. కాబట్టి తాను సినిమా వాడినేనని స్పష్టం చేశారు. అందుకే శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నానన్నారు. వారం రోజుల్లో హోమం నిర్వహిస్తానని... శ్రీతేజ్‌కు ఏం కాదని వేణు స్వామి చెప్పారు.

Also Read: ఎన్డీయే నేతల సమావేశంలో ఈ అంశాలపై కీలక చర్చ


ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప 2. ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రదర్శించారు. ప్రేక్షకులతో కలసి వీక్షించేందుకు హీరో హీరోయిన్లు అల్లు అర్జున్, రష్మిక తదితరులు సంధ్య థియేటర్‌కు వచ్చారు. ఆ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: దాని వెనుకనున్న మతలబేంటో సీఎం బయటపెట్టాలి


అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు అందరికి తెలిసినవే. ఈ సందర్భంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హీరో అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అతడు జైలుకు సైతం వెళ్లారు. అనంతరం కోర్టును ఆశ్రయించడంతో.. అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు అయింది. చిక్కడపల్లి పోలీసుల విచారణకు అల్లు అర్జున్ ఇప్పటికే రెండు సార్లు హాజరైన సంగతి తెలిసిందే.

For Telangana News And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 04:59 PM