Share News

JNTU: విద్యార్థులు తినే పెరుగు తాగేసిన పిల్లి.. జేన్టీయూలో ఇదీ వైనం

ABN , Publish Date - Jul 17 , 2024 | 02:11 PM

Telangana: గత కొద్ది రోజుల క్రితం సుల్తానాబాద్ జె.ఎన్.టి.యు క్యాంటీన్ చట్నీలో ఎలుక సంఘటన మరువక ముందే కూకట్‌పల్లి జేఎన్టీయూహెచ్‌లో పెరుగును పిల్లి తాగుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.రెండురోజుల క్రితం కూకట్‌పల్లి జేఎన్టీయూ విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలను పిల్లులు తింటున్న వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు క్యాంటీన్‌లో వసతి గృహంలో వడ్డిస్తున్న ఆహార పదార్థాలలో నాణ్యత, శుభ్రత ఉండటం లేదని పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు.

JNTU: విద్యార్థులు తినే పెరుగు తాగేసిన పిల్లి.. జేన్టీయూలో ఇదీ వైనం
Kukatpally JNTU

హైదరాబాద్, జూలై 17: గత కొద్ది రోజుల క్రితం సుల్తానాబాద్ జేఎన్టీయూ (JNTU) క్యాంటీన్ చట్నీలో ఎలుక సంఘటన మరువక ముందే కూకట్‌పల్లి జేఎన్టీయూహెచ్‌లో (Kukatpally JNTUH) పెరుగును పిల్లి తాగుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.రెండురోజుల క్రితం కూకట్‌పల్లి జేఎన్టీయూ విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలను పిల్లులు తింటున్న వీడియో సామాజిక మాధ్యమాలలో (Social Media) చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు క్యాంటీన్‌లో వసతి గృహంలో వడ్డిస్తున్న ఆహార పదార్థాలలో నాణ్యత, శుభ్రత ఉండటం లేదని పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పట్టించుకోలేదు.పైగా ఫిర్యాదులు, ఆందోళనలు చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

Harish Rao: ఆ ఎమ్మెల్యేలను మాజీలను చేసేవరకు నిద్రపోం..


యూనివర్సిటీ క్యాంపస్‌లోని మంజీరా బాయ్స్ హాస్టల్లో ఆహార పదార్థాలు నాణ్యతపై ఎప్పటినుంచో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇలా ఉండగా రెండు రోజుల క్రితం ఆహార పదార్థాలపై మొదలు లేకపోవడంతో బకెట్లో ఆహార పదార్థాలను పిల్లి మూతి పెట్టి తింటున్న దృశ్యాలను విద్యార్థులు వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాలను పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. మరి ఇప్పటికైనా ఆహార పదార్థాల నాణ్యత, శుభ్రతపై జేఎన్టీయూ యాజమాన్యం ఎలా స్పందిస్తూ వేచి చూడాలి.

Cat-Drinks-Curd.jpg


ఇవి కూడా చదవండి...

Budget 2024: బడ్జెట్‌ 2024లో ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!

CM Revanth: కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతిపై సీఎం రేవంత్ స్పందన

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2024 | 03:16 PM