Rythu RunaMafi: రుణమాఫీ కానివారికి గుడ్‌న్యూస్
ABN , Publish Date - Sep 30 , 2024 | 03:24 PM
Telangana: గ్రామాల వారీగా రేషన్ కార్డులేని రైతు కుటుంబాల నిర్ధారణను వ్యవసాయ అధికారులు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకుపైగా రేషన్ కార్డు లేక రుణమాఫీ కానీ రైతులున్నట్లు ప్రభుత్వం గుర్తించారు. ఆధార్, బ్యాంకు అకౌంట్‌లో పేర్లలో తప్పులను కూడా అధికారులు సరి చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 30: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన అంశాల్లో రైతు రుణమాఫీ ప్రధానమైనది. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రైతు రుణమాఫీ హామీని నెరవేర్చేందుకు కృషి చేశారు. మూడు విడతల్లో రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. మొదటి విడతలో లక్ష, రెండో విడతలో లక్షన్నర, మూడో విడుతలో రెండు లక్షల మేర రుణమాఫీ చేసింది.
అయితే కొన్ని కారణాల వల్ల కొంత మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లలో పేర్లు తప్పు కారణంగా కొందరు రైతులకు రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డు ఉన్న వారికి రుణమాఫీ అవుతుందని రుణమాఫీలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది. దీంతో రేషన్ కార్డులు లేని కారణంగా మరికొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు.
Tirumala Laddu: దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి: సుప్రీం ధర్మాసనం
త్వరలోనే గ్రీన్ సిగ్నల్
ఈ క్రమంలో రుణమాఫీ కానీ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులేని రైతుల రుణమాఫీకి లైన్ క్లియర్ అయ్యింది. దీనిపై క్షేత్ర స్థాయిలో లెక్కలను సర్కారు బయటకు తీసింది. గ్రామాల వారీగా రేషన్ కార్డులేని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియను వ్యవసాయ అధికారులు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకుపైగా రేషన్ కార్డు లేక రుణమాఫీ కానీ రైతులున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఆధార్, బ్యాంకు అకౌంట్‌లో పేర్లలో తప్పులను కూడా అధికారులు సరి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 20 వేలకు పైగా ఆధార్, బ్యాంక్ అకౌంట్ తప్పులను అధికారులు సరిచేశారు. దీంతో త్వరలోనే రేషన్ కార్డు లేని, ఆధార్ తప్పుల కారణంగా ఆగిన రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. ఇప్పటికే అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రైతుల ఖాతాలో డబ్బులు జమకానున్నాయి. ఆధార్ తప్పులు, రేషన్ కార్డులేని దాదాపు 5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మొత్తం 5 వేల కోట్లు రైతుల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయనుంది.
DSC Results 2024: ఒక్క క్లిక్‌తో డీఎస్సీ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా
మూడు విడతలుగా...
కాగా.. రైతు రుణమాఫీని జూలై 18న ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదటి విడతలో భాగంగా రూ. లక్ష వరకు రుణాలున్న 11 లక్షల 34 వేల మంది రైతుల ఖాతాల్లో రూ. 6 వేల కోట్ల నిధులు జమ చేసింది. జూలై 30న రెండో విడతలో భాగంగా రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు రుణాలున్న 6 లక్షల 40 వేల మంది రైతుల ఖాతాల్లో రూ. 6 వేల 90 కోట్ల నిధులు జమ చేసింది. రెండు విడతల్లో కలిపి రూ. 12 వేల 224 కోట్లు విడుదల చేసింది. ఆగస్టు 17న ఇక మూడో విడుతలో భాగంగా రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు రుణాలున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. అయితే రూ. 2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు కానట్లు తెలుస్తోంది. కేవలం రూ. 2 లక్షల లోపు ఉన్నవారికే రుణమాఫీ సాయం అందినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
Harish Rao: 1962 సేవల పట్ల సర్కార్ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి ఫైర్
Hydra: నేనడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి.. హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు చురక
Read Latest Telangana News And Telugu News