Dasoju Sravan: మోదీ చేతిలో తోలు బొమ్మలా రేవంత్
ABN , Publish Date - Jan 20 , 2024 | 07:14 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM MODI ) చేతిలో తోలు బొమ్మలా సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth reddy ) వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రావణ్ ( Dasoju Sravan ) అన్నారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM MODI ) చేతిలో తోలు బొమ్మలా సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth reddy ) వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రావణ్ ( Dasoju Sravan ) అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని ఎద్దేవా చేశారు. అబద్దాల పునాదుల మీద రేవంత్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం అయ్యాక కూడా రేవంత్ చిల్లర ధోరణి మారడం లేదన్నారు. రాజకీయానికి వేదిగ్గా దావోస్ పర్యటనను వాడుకున్నారన్నారు. భాష ఎలా మాట్లాడినా పర్వాలేదు..కానీ భావం కూడా సరిగా లేదన్నారు. చదువుకున్న మంత్రి శ్రీధర్‌బాబును సీఎం రేవంత్ తక్కువ చేసి చూపారని చెప్పారు. కేటీఆర్ ఐటీ మంత్రిగా గతంలో రాష్ట్ర ఐటీ ఎగుమతులను 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలకు పెంచారన్నారు.
రేవంత్‌వన్నీ అబద్దాలే..
రేవంత్ దావోస్ వేదిక మీద అన్నీ అబద్దాలే ఆడారని చెప్పారు. రైతుల ఆత్మహత్యలపై అంతర్జాతీయ నేతలను తప్పుదోవ పట్టించారన్నారు. అదానీ వ్యవహారాలపై రాహుల్‌గాంధీ కొట్లాడారని.. జేపీసీ, సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్ చేశారని చెప్పారు.ఢిల్లీలో అదానీతో కుస్తీ దావోస్‌లో దోస్తీయా అని సెటైర్లు వేశారు. రేవంత్‌రెడ్డి మోదీని కలిసిన తర్వాత అదానీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారా అని దెప్పిపొడిశారు. ఊరు పేరు లేని కంపెనీతో రేవంత్ 8 వేల కోట్ల రూపాయల పెట్టుబడిపై ఎలా ఒప్పందం కుదుర్చుకుంటారు ? అని ప్రశ్నించారు. టీడీపీ జెండాల రెపరెపల మధ్య రేవంత్ బీఆర్ఎస్ను బొంద పెడతానని లండన్‌లో అన్నారన్నారు. తెలంగాణ ప్రజలు రేవంత్ తీరును గమనిస్తున్నారని దాసోజు శ్రావణ్ తెలిపారు.