Share News

TSRTC: తెలంగాణలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చేశాయోచ్..

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:20 PM

Telangana: రాష్ట్రంలో టీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చేశాయి. మంగళవారం నాడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడేవారని.. ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్చ ఉండేది కాదన్నారు.

TSRTC: తెలంగాణలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చేశాయోచ్..

హైదరాబాద్, మార్చి 12: రాష్ట్రంలో టీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు (TSRTC Electric Buses) అందుబాటులోకి వచ్చేశాయి. మంగళవారం నాడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... 25 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గతంలో ఆర్టీసీ (TSRTC) సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడేవారని.. ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్చ ఉండేది కాదన్నారు. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారని డిప్యూటీ సీఎం అన్నారు.

Nara Lokesh: చిలకలూరిపేట సభ నిర్వహణ కమిటీలతో నారా లోకేష్ సమావేశం


టీఎస్‌ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వ సహాయం అందుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారన్నారు. మహిళల టికెట్ డబ్బులను ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ఒక కార్మికుడిలా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలను మూడు నెలల్లోనే అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి...

Khattar Resigns: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా.. కారణం ఇదే

Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కీలక నిర్ణయం?


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 12 , 2024 | 12:51 PM